Site icon NTV Telugu

IND vs AUS: సెంచరీ బాదిన రుతురాజ్.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం

Gaikwad

Gaikwad

భారత్-ఆస్ట్రేలియా మధ్య గౌహతిలోని బర్సపరా స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కేవలం 6 పరుగులు చేసి ఔట్ కాగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆసీస్ బౌలర్లకు ఊచకోత చూపించాడు. 57 బంతుల్లో (123) సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసి ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇషాన్ కిషన్ డకౌట్ రూపంలో వెనుతిరగగా.. సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులతో రాణించాడు. చివరలో తిలక్ వర్మ కూడా 31 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బౌలర్లలో కానే రిచర్డ్ సన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ సాధించారు.

Exit mobile version