Site icon NTV Telugu

Russia: 11 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ శృంగార కోర్కెలు.. తొమ్మిదేళ్ల జైలు శిక్ష..

Russia

Russia

రష్యాలో ఓ టీచర్ విద్యార్థితో చేయకూడని పనులు చేసింది. తన వద్ద విద్యాభ్యాసం చేసే విద్యార్థిని లొంగదీసుకుని తన శృంగార కోర్కెలను తీర్చుకుంది. బాలుడి తల్లికి ఈ విషయం తెలిసి.. ఆమె పోలీసులను సంప్రదించింది. దీంతో ఆ ఉపాధ్యాయురాలికి తొమ్మిది ఏళ్ల జైలు శిక్ష పడింది. ది న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రష్యా దేశం సెయింట్ పీటర్స్‌బర్గ్ ఉత్తర శివారులోని పాఠశాలలో అన్నా ప్లాక్సుక్ (27) టీచర్‌లో పని చేస్తుంది. అదే పాఠశాలలో చదువుతున్న 11ఏళ్ల విద్యార్థితో హద్దులు దాటింది. ఆమె తన శృంగార కోర్కెల కోసం అతడిలో లైంగిక వాంఛలకు ప్రేరేపించింది. క్లాస్‌రూమ్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో విద్యార్థి చేతులతో తన ప్రైవేటు భాగాలను తాకేలా చేసింది. పెదాలపై ముద్దులు సైతం పెట్టింది.

READ MORE: Palla Srinivasa Rao: కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తాం..

ఇంతటితో ఆగకుండా.. ఆ విద్యార్థి వాట్సాప్‌కి తన నగ్న ఫొటోలను పంపింది అన్నా ప్లాక్సుక్. వీడియోలు సైతం పంపేది. ఆ బాలుడు అన్నాకు ఆకర్శితుడయ్యాడు. ఈ విషయం గమనించిన తల్లి విద్యార్థి ఫోన్ చేక్ చేసింది. ఇంకేముంది.. ఆ బాలుడి వాట్సాప్‌లో టీచర్ నగ్న చిత్రాలు, వీడియోలు, ఛాటింగ్ కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు ఇదేంటని ఆమెను నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగిన పోలీసులు బండారం మొత్తం బయట పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్లాక్సుక్‌ను కోర్టుకు తరలించారు. కోర్టు టీచర్‌కు తొమ్మిది ఏళ్ల జైలు శిక్ష విధించింది.

READ MORE: Pakistan: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో లష్కరే టాప్ టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్‌ హతం..

Exit mobile version