Site icon NTV Telugu

Russia- Ukraine War: ఉక్రెయిన్ పై జిర్కాన్ హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా..

Russia

Russia

ఫిబ్రవరి 7వ తేదీన ఉక్రెయిన్‌పై దాడి సమయంలో రష్యా హైపర్‌సోనిక్ జిర్కాన్ క్షిపణిని ప్రయోగించింది. కీవ్‌లోని శాస్త్రీయ పరిశోధనా సంస్థ ఫోరెన్సిక్ పరీక్షల అధిపతి సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ రూవిన్ ప్రాథమిక సమాచారాన్ని తన టెలిగ్రామ్ ఛానెల్‌లో తెలిపారు. క్షిపణి శకలాలు, వాటిపై రాసి ఉన్న వర్ణన జిర్కాన్ అని రుజువైందని ఆయన అన్నారు.

Read Also: Coal India : రికార్డు బద్దలు కొట్టిన నవరత్న కంపెనీ.. ప్రతి గంటకు రూ.13 కోట్ల లాభం

ఇక, క్షిపణి శిథిలాలను చూపించే వీడియోను ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ రూవిన్ కూడా పోస్ట్ చేశారు. ఈ క్షిపణి 1,000 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుందని తెలిపారు. దాదాపు ధ్వని వేగం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే, సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిర్కాన్ పరీక్షను పూర్తి చేసినట్లు రష్యా జూన్ 2022లో చెప్పిందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త తరం ఆయుధ వ్యవస్థలో భాగంగా జిర్కాన్‌ను అభివర్ణించారు అనే విషయాన్ని గుర్తు చేశారు. ఫిబ్రవరి 7న ఉక్రెయిన్‌లో జరిగిన దాడిలో కనీసం ఐదుగురు మరణించాగా.. నివాస భవనాలు, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం జరిగిందని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Exit mobile version