Site icon NTV Telugu

Russia Ukraine War : సైనికులకు వయాగ్రా.. ఇక రెచ్చిపోండి అంటున్న రష్యా

New Project (6)

New Project (6)

Russia Ukraine War : గత ఏడునెలలుగా నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. అయితే.. ఇప్పటికే ఉక్రెయిన్‌‎లోని చాలా భూభాగాలను రష్యా ఆక్రమించుకుంది. అదే సమయంలో.. ఉక్రెయిన్‌ పౌరులపై కూడా రష్యా బలగాలు దాడికి దిగుతున్నాయి. అంతేకాకుండా.. ఉక్రెయిన్‌ మహిళలపై రష్యా సైనికులు అఘాయిత్యాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొందరు ఉక్రెయిన్‌ మహిళలు, యువతులు తమను రష్యా సైనికులు బెదిరించి ఒంటరిగా, సామూహికంగా లైంగిక దాడులు చేశారంటూ ఆరోపణలు కూడా చేశారు. అయితే.. తాజాగా ఓ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌ మహిళలపై లైంగిక దాడులు చేసేందుకు రష్యా తన సైనికులకు వయాగ్రా ఇస్తున్నదని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రతినిధి ఆరోపించారు.

Read Also: Corona : సింగపూర్‌లో కలకలం రేపుతున్న మరో కరోనా వేవ్‌

బాధితులను అమానవీయంగా మార్చే ఉద్దేశపూర్వక వ్యూహమని విమర్శించారు. లైంగిక హింసపై యూఎన్‌ ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్, ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు శనివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్‌ మహిళలపై రష్యా సైనికుల లైంగికదాడులు ఆ దేశ సైనిక వ్యూహంలో ఒక భాగమని ఆమె ఆరోపించారు. రష్యా సైనికుల వద్ద వయాగ్రా మాత్రలు ఉన్నట్లు బాధిత ఉక్రెయిన్‌ మహిళలు సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఇది స్పష్టమవుతున్నదని అన్నారు. ఉక్రెయిన్‌ మహిళలపై లైంగికదాడులు చేయాలని తన సైన్యానికి రష్యా చెప్పడంతోపాటు దీని కోసం వారికి వయాగ్రా టాబ్లెట్లు కూడా ఇచ్చిందని ఆమె దుయ్యబట్టారు.

Exit mobile version