Russia-Ukraine War: రష్యాపై దాడికి యత్నించిన ఉక్రెయిన్.. 16 డ్రోన్లు కూల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే, గత రాత్రి ఉక్రెయిన్ రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించింది. రష్యా రక్షణ వ్యవస్థలు క్రిమియాపై 16 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయి. ఉక్రెయిన్ దళాలు ఇప్పటికీ రష్యాతో యుద్ధం కొనసాగిస్తున్నాయి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ దక్షిణాన ఉన్న డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ యూనిట్లపై తమ బలగాలు దాడి చేశాయని తెలిపింది.
Read Also: Kotabommali PS Movie Review: కోటబొమ్మాళి పీఎస్ రివ్యూ
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
రష్యన్ దళాలు కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం విఫలమైనప్పటి నుంచి తూర్పు వైపు దృష్టి సారించాయి. అక్కడ ఉక్రెయిన్ భూభాగంలో 20 శాతం కంటే కొంచెం తక్కువగా ఉంటారు. దీంతో దక్షిణ ఖెర్సన్ ప్రాంతంలోని బెరిస్లావ్ పట్టణంపై రష్యా దళాలు దాడి చేయడంతో నలుగురు మరణించారు. జూన్‌లో ప్రారంభించిన ప్రతీకార దాడిలో భాగంగా ఉక్రెయిన్ ద్వీపకల్పంతో పాటు చుట్టుపక్కల ఉన్న రష్యన్ సైనిక లక్ష్యాలపై డ్రోన్, క్షిపణిలతో దాడులను వేగవంతం చేసింది.
Read Also: Shruti Haasan: ట్రెండీ డ్రెస్‌లో అలరిస్తున్న శృతి హాసన్..
ఇక, క్రిమియా ద్వీపకల్పంలో గాలిలో 16 ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా అధికారులు ఇవాళ తెలిపారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. గురువారం రాత్రి ఏరియల్ డ్రోన్లను ఉపయోగించి రష్యా భూభాగంపై దాడి చేయడానికి కుట్ర చేశారు.. అయితే ఉక్రెయిన్ ఈ ప్రయత్నాన్ని తాము తిప్పికొట్టామని ఆయన చెప్పారు. 13 డ్రోన్లు క్రిమియన్ ద్వీపకల్పంపై దాడి చేయబోయయి.. మూడు వోల్గోగ్రాడ్ ప్రాంతం వైపు వెళ్లాయి.. వాటిని మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. అయితే, రష్యా 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని తిరిగి తన ఆధీనంలోకి తీసుకోవాలని ఉక్రెయిన్ ప్లాన్ చేస్తుంది. రష్యా నల్ల సముద్రం నౌకాదళాన్ని ఈ ప్రాంతంలో మోహరించినందున ఉక్రెయిన్ కూడా ఈ ప్రాంతంపై దాడి చేస్తుంది. ఈ ప్రాంతం ద్వారానే రష్యా తన సైన్యానికి ఆయుధాలను సరఫరా చేస్తుంది.
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి