Russia: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అయినా ఆ యుద్ధం ముగిసే సూచనలు మాత్రం కనబడటం లేదు. ఈ క్రమంలోనే యుద్ధాన్ని ఓ “అదృశ్య హస్తం” నడిపిస్తోందని చైనా ఆరోపించింది. అయితే, అది అదృశ్య హస్తం కాదని, అమెరికా హస్తమని రష్యా తాజాగా పేర్కొంది. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి చమత్కారంగా చెప్పినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ వెల్లడించారు. ఈ యుద్ధం ముగియాలని అమెరికా కోరుకోవడం లేదని.. ఈ యుద్ధాన్ని కొనసాగించాలని కోరుకుంటోందని.. ప్రతీదీ చేస్తోందని, ఇది కనిపించే హస్తమేనని ఆయన పేర్కొన్నారు.
Read Also: Turkey Earthquake: టర్కీ భూకంప నష్టాన్ని అంచనా వేసిన ఐక్యరాజ్యసమితి.. ఎంతంటే?
అమెరికా, దాని మిత్రదేశాలు ఉక్రెయిన్‌ను యుద్ధం చేయడానికి పావుగా ఉపయోగించుకుంటున్నాయని మాస్కో పదేపదే ప్రకటించింది. ఈ కథనాన్ని ఉక్రెయిన్‌తోపాటు పశ్చిమ దేశాలు వాటిని కొట్టిపారేశాయి. రష్యా ఆక్రమణలకు వ్యతిరేకంగా కీవ్ పోరాడుతోందని వెల్లడించాయి. చైనా కాల్పుల విరమణ చొరవను ప్రస్తావిస్తూ.. పెస్కోవ్ మాట్లాడుతూ, మాస్కో బీజింగ్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అటువంటి శక్తివంతమైన దేశానికి ప్రపంచ సమస్యలపై గొంతు వినిపించడం సహజమని అన్నారు. చైనా విదేశాంగ మంత్రి కిన్ గ్యాంగ్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ వివాదం మరింత కాలం కొనసాగేలా, అది తీవ్రంగా మారేలా ఒక అదృశ్య హస్తం నడిపిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు.