NTV Telugu Site icon

Cyber Attack On Russia: బ్రిక్స్ సమ్మిట్ వేళ.. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖపై భారీ సైబర్ దాడి

Cyber Attack

Cyber Attack

Cyber Attack On Russia: రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్‌ దాడికి గురైందని సంబంధిత ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్‌దాడికి లక్ష్యంగా చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. అధికారిక వెబ్‌సైట్, మౌలిక సదుపాయాలపై బుధవారం నాడు ఉదయం వివిధ విదేశాల నుంచి భారీ సైబర్‌ ఎటాక్ ప్రారంభమైంది. అయితే.. మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా ఇలాంటి విదేశీ సైబర్‌ దాడులను శక్తిమంతంగా ఎదుర్కొంటోంది.

Read Also: IND vs NZ 2nd Test: టాస్ గెలిచిన న్యూజీలాండ్.. మూడు మార్పులతో భారత్! తుది జట్లు ఇవే

అయితే, బుధవారం చేసిన సైబర్‌ దాడి మాత్రం చాలా తీవ్రమైందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఆంక్షలను లెక్కచేయకుండా ప్రపంచ స్థాయిలో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలను రష్యాలోని మాస్కో కజాన్‌లో జరిపింది. రష్యా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కజన్‌ నగరంలో జరుగుతున్న ‘బ్రిక్స్‌’ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్‌ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Kanguva : కంగువా సాంగ్‌లో దిశా డీప్ క్లీవేజ్‌.. ఆబ్జెక్ట్ చేసిన సెన్సార్ బోర్డ్