Vladimir Putin: రష్యా ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరారు. దేశం యొక్క జాతి మనుగడ కోసం రష్యన్ కుటుంబాలు కనీసం ఇద్దరు పిల్లలను కలిగి ఉండాలన్నారు. అలాగే, దేశం అభివృద్ధి చెందాలంటే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని ఆయన తెలిపారు. రష్యన్లు తమ గుర్తింపును కాపాడుకోవాలంటే కుటుంబానికి కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలని యూరల్స్ ప్రాంతంలోని ట్యాంక్ ఫ్యాక్టరీలోని కార్మికులతో పుతిన్ చెప్పారు.
Read Also: KPI Green Energy : సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఆర్డర్.. 14000శాతం పెరిగిన కంపెనీ షేర్
ఒక నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. రష్యాలో జననాల రేటు 1990ల నుంచి నిరంతరం పడిపోతోంది. అదే సమయంలో, ఉక్రెయిన్- రష్యా మధ్య గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం నుంచి దేశంలో మూడు లక్షల మందికి పైగా మరణించారు. రాబోయే దశాబ్దాల్లో రష్యా జనాభాను పెంచడమే మా లక్ష్యం అని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాటలలో స్పష్టమైంది. రెండు సంవత్సరాల క్రితం ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి చాలా మంది రష్యన్లు మరణించారు. ఇది మాత్రమే కాదు ఈ యుద్ధానికి రావాల్సిందిగా దేశంలో పురుషులకు సైన్యం ఆదేశాలు జారీ చేయడంతో భయంతో వేలాది మంది ప్రజలు దేశం విడిచి పెట్టి వెళ్లి పోతున్నారు.