Russia New Plan: అమెరికాకు షాక్.. మాస్టర్ ప్లాన్ వేసిన రష్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా తన ఇంధన ఎగుమతులను కొనసాగించడానికి అమెరికా , యూరోపియన్ దేశాల ఆంక్షలను అధిగమిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అమెరికా, యూరోపియన్ యూనియన్ (EU) , బ్రిటన్ ఆంక్షలు విధించినప్పటికీ.. రష్యా తన ‘ఆర్కిటిక్ LNG 2’ ప్లాంట్ నుంచి సహజ వాయువును (LNG) విక్రయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలకు భారీ డిస్కౌంట్లతో ఈ గ్యాస్‌ను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై అమెరికా , ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో LNG సరఫరాకు అంతరాయం ఏర్పడి.. ధరలు ఆకాశాన్నంటాయి. ఈ తరుణంలో.. మార్కెట్ ధర కంటే 40 శాతం తక్కువ ధరకే రష్యా గ్యాస్‌ను ఆఫర్ చేస్తోంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి చైనా , రష్యాకు చెందిన మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా ఈ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ గ్యాస్ రష్యాది కాదని.. ఒమన్ లేదా నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చినట్లుగా నకిలీ పత్రాలను కూడా ఈ సంస్థలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Also Read:Yuvraj Singh: ‘6 నెలలు మాత్రమే బతుకుతామన్నారు’.. క్యాన్సర్ పరిస్థితులపై యూవరాజ్ సింగ్ భావోద్వేగం..
ఆంక్షలు లేని రష్యాలోని ‘యామల్ LNG’ ప్లాంట్ నుంచి గత ఐదు నెలల్లో తొలిసారిగా చైనాకు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరిలో ఈ ప్లాంట్ నుంచి వచ్చిన గ్యాస్ అంతా యూరోపియన్ దేశాలకే వెళ్లింది. అయితే.. త్వరలోనే రష్యా గ్యాస్‌పై EU నిషేధం విధించనుండటంతో రష్యా తన మార్కెట్‌ను ఆసియా వైపు మళ్లిస్తోంది.
ఆసియా దేశాల పరిస్థితి..
ఇరాన్ దాడుల కారణంగా ఖతార్‌లోని LNG హబ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఆసియా దేశాలకు ఇంధన కొరత ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో జపాన్ వంటి ధనిక దేశాలు కూడా ఖరీదైన గ్యాస్‌ను కొనలేక తిరిగి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వైపు మళ్లుతున్నాయి. రష్యా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని.. ఆంక్షలు ఉన్నప్పటికీ రహస్య మార్గాల్లో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో , ఇంధన మార్కెట్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!