Site icon NTV Telugu

Russian Ukrainian War: ప్రతీకారం తీర్చుకున్న రష్యా.. 600మంది ఉక్రెయిన్ల హతం

Russia Ukraine

Russia Ukraine

Russian Ukrainian War: తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు భవనాలపై భారీ రాకెట్ తో రష్యా దాడి చేసింది. ఈ దాడిలో 600 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు హతమైనట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. రష్యా చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ నుండి ఎలాంటి సమాచారం లేదు, అయినప్పటికీ క్రామాటోర్స్క్ మేయర్ ఈ దాడిలో ఎవరూ చనిపోలేదంటూ సోషల్ మీడియాలో తెలిపారు.

Read Also: Chiranjeevi: ఈవెంట్ కు రాకుండా శృతి హాసన్ ను బెదిరించారు

రెండు మూడు రోజుల కింద ఉక్రెయిన్ డోనెట్స్క్ ప్రాంతంలోని మకివ్కాలోని రష్యన్ బ్యారక్స్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో కనీసం రష్యా సైనికులు 89మంది మరణించారు. ఈ మారు ఉక్రెయిన్ సేనలను లక్ష్యంగా దాడులు నిర్వహించగా 600 మంది రష్యా సైనికులు మరణించారు. అయితే, సైనికుల మరణాల సంఖ్యపై ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

Read Also: Ravi Teja: వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కాదు.. బ్లాక్ బస్టర్

‘ఉక్రేనియన్ ఆర్మీ తాత్కాలిక విస్తరణ పాయింట్లపై రష్యా భారీ క్షిపణితో దాడిచేసింది. ఈ దాడిలో 600 మందికి పైగా ఉక్రేనియన్ సైనికులు హతమయ్యారు.’ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్కడ మీడియా ప్రతినిధులు దాడి ప్రాంతాలను సందర్శించినట్లు సమాచారం. రష్యాపై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఉక్రేనియన్ సైనికులను తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసింది. అక్కడ క్షిపణులు నేరుగా తాకినట్లు లేదా తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపించలేదు. సైనికులు అక్కడ నివసిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు లేవు. మృతదేహాలు కానీ రక్తపు జాడలు లేవని వారు పేర్కొన్నారు.

Exit mobile version