Chiranjeevi: ఈవెంట్ కు రాకుండా శృతి హాసన్ ను బెదిరించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: గాడ్ ఫాదర్ తరువాత చిరంజీవి నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ.. ” విశాలమయిన మనసున్న వారు విశాఖ వాసులు.. రామకృష్ణ బీచ్ లో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు..విశాఖలో స్థలం కొన్నాను.. నా చిరకాల కోరిక ఇక్కడ ఇల్లు కట్టుకుని విశాఖ పౌరుడిని కావాలని ఈ మధ్యనే భీమిలి సైడ్ స్థలం తీసుకున్నాను.. ఇక సినిమా టైటిల్ చెప్పగానే ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పాను. ఎందుకంటే వాల్తేరు అనగానే నాలో ఒక ఫీల్ వచ్చింది. మొదటి సిట్టింగ్ లోనే కథ నచ్చింది అని చెప్పడం నేను చాలా రేర్. నా సూపర్ డూపర్ సినిమాలు అన్నీ ఇలాగే ఉంటాయి.. ఈ సినిమా బాగా ఆడుతుంది.. రెండు సంవత్సరాలు బాబీ ని దగ్గర నుంచి చూశాను.
బాబీలో నలుగురు నిష్ణాతులు కనిపించారు.. ఒకరు కథకుడు, రెండవ వాడు రచయిత, మూడు స్క్రీన్ ప్లే రైటర్, ఆ తర్వాత డైరెక్టర్.. అతని టాలెంట్ అత్యద్భుతం అని సినిమా ఇచ్చాను.. అభిమానిగా ఇవ్వలేదు. బాబీ లోని హార్డ్ వర్క్,పనితనం, మంచితనం అన్ని చూశాక బాబీ మీద అభిమానం పెరిగిపోయింది.. అతనికి పెద్ద అభిమానిగా మారిపోయాను. ఇలాంటి సినిమా అని చెప్పడం కాదు.. నేనెప్పుడూ సినిమా నాగురించి చెప్పను.. మా ప్రయత్నం మేము చేశాం.. మీకు నచ్చితే చూడండి అని చెప్తాను. కానీ, ఈ సినిమా అయితే ఇది సినిమా.. ఇది రా సినిమా అనేలా బాబీ తీసాడు. బయటికి వచ్చేటప్పుడు మీరు కూడా అలాగే అనుకుంటారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ గురించి చెప్పాలంటే.. చాలా మంచి ప్రొడక్షన్. ఒకే రోజు రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్న ఏకైక ప్రొడక్షన్ ఏదైనా ఉంది అంటే అది మైత్రీ. నా సినిమాతో పాటు వీరసింహారెడ్డి సినిమా కూడా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. డబ్బు లెక్క చూడకుండా సినిమా కోసం ఖర్చు పెట్టడంలో నిర్మాతలు ఎక్కడ తగ్గలేదు. వారికి మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను.
Also Read
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
ఇక నా తమ్ముడు రవితేజ. సినిమాలో ఏదో తక్కువ అయ్యింది.. ఇంకో క్యారెక్టర్ ను పెట్టాలి. రవితేజను అనుకుంటున్నాం అన్నప్పుడు నాలో ఉత్సహం పొంగింది. నాతో ఢీకొట్టేలా ఉండే పాత్రను రవి చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అన్నయ్య సినిమాలో నా తమ్ముడిగా చేసిన రవితేజ.. ఇప్పుడు అంచలంచెలుగా ఎదిగి మాస్ మహారాజా లా ఎదిగాడు అంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. రవితేజ సెట్ లో అస్సలు ఫోకస్ చేసేవాడు కాదు.. ముచ్చట్లు పెట్టేవాడు. తెగ అల్లరివాడు. బెజవాడ నుంచి వచ్చాడు అన్నాడు కానీ పక్కా ముంబై మనిషి. అక్కడ అమితాబ్ అనే ఇష్టం.. ఇక్కడ నేను అంటే ఇష్టమని చెప్తాడు. రవితో చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక శృతి హాసన్.. ఆ అమ్మాయి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేసి చెప్పింది. ఆ అమ్మాయిని ఈవెంట్ కు రాకుండా ఎవరో బెదిరించారు.. ఒంట్లో నలతగా ఉంది అని చెప్పింది. కరోనా కాకుండానే కోరుకుంటున్నా అని చెప్పింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ వారికి కృతజ్ఞతలు తెలిపాడు. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని చిరంజీవి తెలిపాడు.
https://www.youtube.com/watch?v=xIn8M3ZnToI
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?