Russia : అమెరికా ప్రముఖులపై రష్యా నిషేధం.. మాజీ అధ్యక్షుడు ఒబామాతో సహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia : అమెరికా-రష్యాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే పలు అంశాలకు సంబంధించి అమెరికా.. రష్యాపై అంక్షలను విధించింది. దీనిపై రష్యా ఘాటుగా స్పందించింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎస్ మాజీ అధ్యక్షులు సహా పలువురు ప్రముఖులపై ఆంక్షలు విధించింది. అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా రష్యా 500 మంది ప్రముఖ అమెరికన్లపై నిషేధం విధించింది. వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఉన్నారని సమాచారం.
Read Also:Nellore YCP: నెల్లూరు నగర వైసీపీలో మరోసారి విభేదాలు
Also Read
యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం విధించిన రష్యా వ్యతిరేక ఆంక్షలకు ప్రతిస్పందనగా అమెరికా కార్యనిర్వాహక శాఖకు చెందిన పలువురు సీనియర్ సభ్యులతో సహా 500 మంది అమెరికన్లను దేశంలోకి రానివ్వకుండా నిషేధిస్తున్నామంటూ రష్యా ప్రకటించింది. ఈ జాబితాలో ఆ దేశ మాజీ అధ్యక్షులు ఒబామాతో పాటు అమెరికా మాజీ రాయబారి జాన్ హంట్స్ మన్, పలువురు అమెరికా సెనేటర్లు, జాయింట్ చీఫ్స్ తదుపరి చైర్మన్ చార్లెస్ క్యూ బ్రౌన్ జూనియర్ కూడా ఉన్నారు. ప్రముఖ అమెరికన్ లేట్ నైట్ టీవీ షో హోస్ట్ లు జిమ్మీ కిమ్మెల్, కోల్బర్ట్, సేథ్ మేయర్స్ లను కూడా దేశంలోకి ప్రవేశించకుండా రష్యా నిషేధించింది.
Read Also:AP Polycet Results: ఏపీ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Ind Vs Pak: కాటేరమ్మ కొడుకు దూకుడు.. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ పూర్తి..
-
CM Revanth Reddy : కోటి ఓట్లు.. 90 సీట్లు మా టార్గెట్..
-
Man Rescued: డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తి.. నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా బయటకు..
-
Pakistan minister: ఉగ్రవాదం, సింధు జలాలపై పాక్ మంత్రి దాటవేత!
-
Nitin Nabin: రాహుల్ గాంధీతో చర్చకు బీజేపీ మండలాధ్యక్షుడు చాలు..
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!