Site icon NTV Telugu

Parshottam Rupala: క్షత్రియ వర్గాన్ని క్షమాపణ కోరిన కేంద్రమంత్రి

Dkeke

Dkeke

క్షత్రియ సమాజంపై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి రూపాలా మరోసారి క్షమాపణలు చెప్పారు. క్షత్రియ వర్గానికి చెందిన మాజీ పాలకులను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పారు. ఇలా క్షమాపణలు చెప్పడం ఇది నాలుగో సారి. గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు ఈ విధంగా స్పందించారు.

ఇది కూడా చదవండి: Indian Economy: ప్రధాని మోడీ, అదానీ-అంబానీలు భారతదేశాన్ని “ఎకనామిక్ సూపర్ పవర్‌”గా మారుస్తున్నారు.. CNN నివేదిక

తాను చేసిన ఒక్క ప్రకటన.. ఎన్నికల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించిందన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఈ తప్పిదానికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తన వల్ల పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నష్టం వాటిల్లడం బాధాకరం అన్నారు. క్షత్రియ సమాజం మొత్తానికి మరోసారి క్షమాపణలు చెబుతున్నానని.. ఇది రాజకీయ ప్రేరేపితమైంది కాదని కేంద్ర మంత్రి రూపాలా వేడుకున్నారు.

ఇది కూడా చదవండి: Delhi: రామ్‌మనోహర్ ఆస్పత్రిలో అవినీతి రాకెట్‌.. 9 మంది అరెస్ట్

Exit mobile version