Tamilnadu: తప్పిన పెనుప్రమాదం.. అర్ధరాత్రి రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు

Bus Catches Fire

Bus Catches Fire

Tamilnadu: తమిళనాడులో పెను ప్రమాదం తప్పింది. బస్సు నుంచి ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. అంటుకున్న మంటలు కాసేపట్లోనే పెద్దగా వ్యాపించాయి. సేలం జిల్లా మెట్టూరు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోయంబత్తూరు నుంచి 44 ప్రయాణీకులతో బెంగళూరుకు బయలుదేరగా.. మెట్టూరు వద్ద మంటలు చోటుచేసుకున్నాయి.

Water Contamination : హిమాచల్ ప్రదేశ్‎లో కలుషిత నీరు తాగి 535మందికి అస్వస్థత

×
×
Ad

అప్రమత్తమైన బస్సు డ్రైవర్‌ రాజన్‌.. బస్సులోని వారందరినీ క్షేమంగా కిందకు దిగేలా చేశారు. ఆయన అప్రమత్తత కారణంగా 44 మంది ప్రాణాలు నిలిచాయి. బస్సులో వారందరు ఒకే సారి బయటకు పరుగులు తీయడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు మహిళలతో సహా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగి ఆ బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రయాణికుల ప్రాణాలను రక్షించిన డ్రైవర్‌ రాజన్‌ను అందరూ అభినందిస్తున్నారు.