బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రేణింగవరం వద్ద నేడు నేషనల్ హైవే అథారిటీ అధికారులు హైవే రన్ వే ట్రైల్ రన్ నిర్వహించనున్నారు. రేణింగివరం, కొరిశపాడు మధ్య నిర్మించిన ఎయిర్ ప్యాడ్ జాతీయ రహదారుల పై విమానాల అత్యవసర ల్యాండింగ్‌కు అవసరమైన 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం వరకు రహదారిని నిర్మించారు అధికారులు. నేడు ఉదయం 11 గంటలకు భారత వైమానికి దళానికి ( ఐఏఎఫ్) చెందిన ఓ కార్గో విమానం, నాలుగు ఫైటర్‌జెట్ యుద్ద విమానాలు జాతీయ రహదారి పై అత్యవసరంగా ల్యాండింగ్ కానున్నాయి. హైవే పై అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు వీలుగా ప్రత్యేకంగా రోడ్డును నిర్మించినట్లు వెల్లడించారు అధికారులు. దీంతో విమానాశ్రయాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే సమయం తగ్గుతుందని చెప్పారు.
Also Read : Kidnapping Girl: జగిత్యాల జిల్లాలో కిడ్నాప్‌కలకలం.. బాలికను కారులో ఎక్కించుకుని..
వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్దితుల్లో యుద్ద విమానాలను సైతం దింపటానికి అనువుగా రన్ వే ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం రన్ వేలు ఏర్పాటు. ఏపీలో బాపట్ల జిల్లా లోని కొరిశపాడు, ప్రకాశం జిల్లా సింగరాయకొండలలో రెండు చోట్ల ఎమర్జెన్సీ రన్ వేలను సిద్దం చేసింది కేంద్రం. రన్ వే కోసం నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఆరు మీటర్ల మేరా తవ్వి నాలుగు లేయర్లుగా సిమెంట్ రోడ్డు నిర్మించారు. డివైడర్లును, చుట్టు పక్కల ఉన్న చెట్లను, విద్యుత్ తీగలను తొలగించి నిర్మాణం చేపట్టారు. రన్ వేపై నాలుగు ఫైటర్ జెట్ విమానాలు, కార్గో విమానాల ట్రయల్ రన్ నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసింది వైమానిక దళ సిబ్బంది.