టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. రూల్స్ రంజన్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా గురువారం (నవంబర్ 30) సాయంత్రం 6 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ఉండనున్నట్లు ఆహా ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.. నవంబర్ 30 న సాయంత్రం 6 గంటలకు “రూల్స్ బుక్ ను తిరగ రాయడానికి రూల్స్ రంజన్ వచ్చేస్తున్నాడు అని వెల్లడించింది. నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది.
ఈ సినిమాలో చూపించిన లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవడం అలాగే కామెడీ కూడా ఆశించిన స్టాయిలో వర్కవుట్ కాకపోవడంతో రూల్స్ రంజన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ వీక్‌లోనే రూల్స్ రంజన్ మూవీ థియేటర్లలో కనిపించకుండాపోయింది. థియేటర్ రిజల్ట్ కారణంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమైనట్లు సమాచారం. రూల్స్ రంజన్ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి అలాగే మెహర్ చాహల్ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో సుబ్బరాజు, హర్ష చెముడు మరియు హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడు గతంలో గోపీచంద్ ఆక్సిజన్ మరియు నీ మనసు నాకు తెలుసుతో పాటు మరికొన్ని సినిమాలకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బావరం రీసెంట్ గా నటించిన మీటర్ మూవీ తో పాటు రూల్స్ రంజన్ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీనితో ఈ హీరో కెరీర్ రిస్క్ లో పడింది.దాదాపు నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రూల్స్ రంజన్ మూవీ థియేటర్లలో రిలీజైంది. కేవలం కోటిన్నర వరకు మాత్రమే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.
https://x.com/ahavideoIN/status/1729809961465544820?s=20