Rules Ranjan : ప్రభాస్ వస్తాడు అనుకుంటే రూల్స్ రంజన్ వస్తున్నాడుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.ఈ హీరో ఇప్పటికే ఈ ఏడాదిలోనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్’ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదిలా ఉంటే తన తరువాత సినిమా రూల్స్ రంజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు.కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.అలాగే రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
‘రూల్స్ రంజన్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘నాలో నేనే లేను’, ‘సమ్మోహనుడా’ వంటి పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. సమ్మోహనుడా పాట సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అవుతుందో తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రంలో మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ క్రమంలో మేకర్స్ ‘రూల్స్ రంజన్’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్..ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్లాస్ లుక్ లో నేహా, కిరణ్ ఆకట్టుకున్నారు.అయితే సెప్టెంబర్ 28 వ తేదీన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ విడుదల చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే గత కొన్ని రోజులుగా సలార్ సినిమా వాయిదా పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రూల్స్ రంజన్ సినిమా అదే తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో సలార్ సినిమా వాయిదా పడినట్లే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు..
Also Read
తాజావార్తలు
-
Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
-
Sing Geetham :ఇంట్లో కూర్చునే 94 ఏళ్ల వయసులో డైరెక్షన్.. అద్భుత టెక్నాలజీని బయటపెట్టిన సింగీతం!
-
UP: సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
-
Pawan Kalyan: “ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!”.. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
-
Uddhav Thackeray: ఉద్ధవ్ శివసేన మళ్లీ చీలిపోయింది.. ఎంపీల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!