‘కాంతార 2’ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి జనాల్ని మెప్పించిన బ్యూటీ రుక్మిణీ వసంత్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉంది. భాషతో సంబంధం లేకుండా చేతినిండా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈమె, త్వరలో బాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా పలకరించడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రుక్మిణి, హిందీ గురించి ఓపెన్‌గా మాట్లాడింది..
Also Read : Lenin : ‘లెనిన్’ హిట్ కోసం అఖిల్.. స్పెషల్ ఎఫర్ట్
‘ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా హిందీ తనకు చిన్నప్పటి నుంచే చాలా సులభంగా అర్థమవుతుందని, బాలీవుడ్ సినిమాల మీద ఎప్పుడూ ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉండేది. నిజం చెప్పాలంటే, ఆ భాషలో నా ఫీలింగ్స్ (భావోద్వేగాలు) పూర్తిగా చూపించే ఛాన్స్ నాకు ఇప్పటి వరకు దొరకలేదు. అందుకే ఆ అవకాశం కోసం నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను’ అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది. ఆమె ఈ విధంగా మాట్లాడటం చూస్తుంటే, ఇతర ఇండస్ట్రీల్లో కూడా తన టాలెంట్‌ను చూపించాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు అర్థమవుతోంది.
అంతేకాదు, బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కూడా రుక్మిణీ కీలక విషయాలను వెల్లడించింది.. ‘దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. దేవుడి దయ ఉంటే, నేను త్వరలోనే ఆ పనిని (బాలీవుడ్ డెబ్యూ) మొదలుపెడతానని గట్టిగా నమ్ముతున్నాను’ అని ఆమె నమ్మకంగా చెప్పింది. ఆమె అరంగేట్రం గురించి జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ,
“దీని గురించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. దేవుడి దయ ఉంటే, నేను త్వరలోనే ఆ పనిని ప్రారంభిస్తానని భావిస్తున్నాను,” అని చెప్పింది. రుక్మిణీ ఇచ్చిన ఈ హింట్ తో ఆమె ఇప్పటికే ఓ పెద్ద హిందీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు మరియు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కన్నడ నటి బాలీవుడ్‌లో ఏ దర్శకుడితో కలిసి, ఎలాంటి పాత్రతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందో చూడాలి.
