Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ దక్కిందంటే అది కెరీర్‌కు ప్లస్ అవుతుందని అందరూ భావిస్తారు. కానీ కొన్నిసార్లు ఆ భారీ చిత్రాల షూటింగ్ ఆలస్యం కావడం వల్ల నటీనటులు ఇతర అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్, యంగ్ హీరోయిన్ కాయదు లోహర్ విషయంలో ఇదే జరుగుతోంది. తాము కమిట్ అయిన భారీ పాన్ ఇండియా చిత్రాల కోసం వీరు దాదాపు 3 నుంచి 4 క్రేజీ సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్‘ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మరియు మేకర్స్ కోరిన బల్క్ డేట్స్ కారణంగా ఆమె వేరే చిత్రాలకు సైన్ చేయలేకపోతోందట. ఇప్పటికే ఆమె చేతికి వచ్చిన కొన్ని మంచి ఆఫర్లను వదులుకున్నట్లు సమాచారం. అయితే ప్రశాంత్ నీల్ సినిమాలో ఛాన్స్ అంటే అది మామూలు విషయం కాదు కాబట్టి, ఈ నిరీక్షణకు తగ్గ ఫలితం ఉంటుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‘ చిత్రంలో కాయదు లోహర్ ‘సుబ్బలక్ష్మి’గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె కూడా కొన్ని ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందని టాక్. ‘దసరా’ వంటి మాసివ్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల తీస్తున్న సినిమా కావడంతో కాయదు లోహర్ ఈ చిత్రం కోసం ఎక్కువ డేట్స్ కేటాయిస్తోంది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత ఈ ఇద్దరు భామలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రావాలని వారు చేసిన త్యాగానికి తగిన ప్రతిఫలం దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!