NTV Telugu Site icon

RTC Bus Accident: శ్రీశైలంలో లోయలో పడబోయిన తెలంగాణ ఆర్టీసీ బస్సు

Bus

Bus

RTC Bus Accident: శ్రీశైలం డ్యాం వద్ద ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్యాం సమీపంలోని టర్నింగ్ వద్ద అదుపు తప్పి గోడను బలంగా ఢీకొంది. గోడకు ముందు ఇనుప రాడ్లను తగులుకొని బస్సు నిలిచిపోయింది. లేదంటే భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేది. ప్రయాణికులకు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు యధావిధిగా మహబూబ్ నగర్ కి చేరుకుంటుంది.

Read Also: EarthQuake: పాక్ లో భూకంపం.. ఇళ్లనుంచి పరుగులు తీసిన జనం

టీఎస్‌ ఆర్టీసీకి చెందిన బస్సు మహబూబ్‌నగర్‌ నుంచి శ్రీశైలంకు వెళ్తుండగా ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రం వద్ద ఒక్కసారిగా బస్సు ఆదుపుతప్పింది. బస్సు గోడలను ,రేయిలింగ్‌ను ఢీ కొట్టి నిలిచిపోయింది. రేయిలింగ్‌ లేనిపక్షంలో బస్సు లోయలో పడేదని ప్రయాణికులు తెలిపారు. ఘటన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనను చూసి తీవ్రంగా భయాందోళనకు గురైన ప్రయాణికులు తమను శ్రీశైలం మల్లన్న కాపాడారని భక్తులు పేర్కొన్నారు. అనంతరం ప్రయాణికులను ఇతర బస్సులో తరలించారు. ఘటన వివరాలను డ్రైవర్‌ నుంచి ఆర్టీసీ అధికారులు అడిగి తెలుసుకున్నారు.

Read Also: Boat capsize : విహారంలో విషాదం.. బోటు బోల్తాపడి పదిమంది చిన్నారుల మృతి