మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నారు. రీసెంట్ గా రవితేజ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో మరో మూవీ చేయడానికి సిద్ధం అయిన సంగతి తెలిసేందే.వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ వస్తుందని తెలిసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి.ఆ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.రీసెంట్ గా వీరి కాంబో లో మరో మూవీ రాబోతున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. RT 4 GM అనే వర్కింగ్ టైటిల్ తో ఆ పోస్టర్ను విడుదల చేసారు. ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఆ పోస్టర్ లో చుండూరు విలేజ్ పేరు కూడా ఉండటంతో..ఈ మూవీ కాన్సెప్ట్పై మరింత ఇంట్రెస్ట్ పెంచుతోంది. చుండూరు అంటే ఏపీ లోని ఒక గ్రామం. ఈ గ్రామంలో జరిగిన మారణహోమం ఇప్పటికీ కూడా మరిచిపోలేని అంశం. 1991 సం,లో అగ్రవర్ణాల కులాలకు చెందిన కొంత మంది, ఓ వర్గంపై దాడి చేసి కర్రలతో, కత్తులతో వెంటాడి చంపినా తీరు ఎంతో దారుణం.. ఈ ఘటనలో మొత్తం 8 మంది మరణించారు. ఇక ఆ వర్గానికి చెందిన వారిని ముక్కలు నరికి తుంగభద్ర నదిలో పడేశారు. ఈ కథాంశంతో సినిమా రూపొందుతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి ఇదే కనుక నిజమైతే రవితేజ ఖాతాలో మరో హిట్ ఖాయమని సినీ వర్గాల వారు వారి అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే లేటెస్ట్ గాఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజతో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ధమాకా జోడీ రిపీట్ అయితే డబల్ ధమాఖా షురూ అయినట్టే అని మాస్ రాజా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ధమాకా సినిమా విజయం సాధించింది. వీరిద్దరూ కలిసి వేసిన డాన్స్ స్టెప్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. దీంతో RT 4 GM వీరి కాంబో ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తుంది.త్వరలో శ్రీలీలకు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోందని సమాచారం.