Site icon NTV Telugu

Trump India Tariffs: భారత్‌పై అమెరికా 50 % అదనపు సుంకం.. RSS కీలక నిర్ణయం..

Rss

Rss

Trump India Tariffs: భారతదేశంపై అమెరికా 50 % అదనపు సుంకం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్‌ఎస్‌ఎస్, స్వదేశీ జాగరణ్ మంచ్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికన్ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం కింద, దేశవ్యాప్తంగా విదేశీ కంపెనీలను, వాటి ఉత్పత్తులను బహిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో కోకా-కోలా , పెప్సి , అమెజాన్, కేఎఫ్‌సీ వంటి అనేక అమెరికన్ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రచారం 1942లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన “క్విట్ ఇండియా” ఉద్యమం నుంచి ప్రేరణ పొందిందని చెబుతున్నారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ఓ లాంఛనప్రాయ నిరసనను కూడా నిర్వహించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వంటి కంపెనీల నుంచి వస్తువులను కొనుగోలు చేయవద్దని ప్రచారం చేస్తున్నారు. స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రేరేపించేందకు ఇదే సరైన సమయమని ఆర్ఎస్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

READ MORE: Gold Prices: పసిడి మెరుపులకు సుంకాలు కారణం అయ్యాయా?… బంగారం ధరలు ఎంతవరకు పెరగవచ్చు..

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మన ఉత్పత్తులపై ప్రకటించిన 50% సుంకాన్ని, ఎగుమతిదార్లు చెల్లించక తప్పేలా లేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏమీ తేలకపోవడంతో ఆగస్టు 7 నుంచి 25%, ఆగస్టు 27 నుంచి మరో 25% సుంకాన్ని అమలు చేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఆరో దఫా వాణిజ్య చర్చల కోసం అమెరికా బృందం ఈనెల 25న భారత్‌కు రానుంది. అదనపు 25% సుంకం వసూలుకు అప్పటికి మరో 2 రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. మధ్యంతర ఒప్పందం శరవేగంగా కుదురుతుందనే ఆశలు సన్నగిల్లుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Exit mobile version