NTV Telugu Site icon

RSS chief Mohan Bhagwat: పాక్‌ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.. విభజన పొరపాటుగా జరిగింది..

Rss Chief

Rss Chief

RSS chief Mohan Bhagwat: ఏడు దశాబ్దాలకు పైగా స్వాతంత్య్రం పొందిన తరువాత పాకిస్తాన్‌లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, విభజన పొరపాటుగా జరిగిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం అన్నారు. భారత్‌కు వచ్చిన వారు సంతోషంగా ఉన్నారని, అయితే పాకిస్థాన్‌లో ఉన్నవారు సంతోషంగా లేరని భగవత్ అన్నారు. యువ విప్లవకారుడు హేము కలానీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సింధీలు పాల్గొన్నారు.

“ఈ రోజు, పాకిస్తాన్ ప్రజలు భారత విభజన పొరపాటు అని అంటున్నారు, భారతదేశం నుంచి విడిపోయిన వారు ఇంకా సంతోషంగా ఉన్నారా? భారతదేశానికి వచ్చిన వారు ఈ రోజు సంతోషంగా ఉన్నారు, కాని అక్కడ ఉన్నవారు (పాక్‌లో) సంతోషంగా లేరు” అని మోహన్ భగవత్ చెప్పారు. 1947లో మొండితనం కారణంగా భారత్ నుంచి విడిపోయిన వారు ఇప్పటికీ సంతోషంగా ఉన్నారా? అక్కడ బాధ ఉందని మోహన్‌ భగవత్ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ.. భారత్‌లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అఖండ భారత్ నిజమేనని, అయితే విభజించబడిన భారత్ ‘పీడకల’ అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చెప్పారు. నవ భారతాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు.”అఖండ భారత్ (ప్రస్తుతం ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్‌లలో ఉన్న అన్ని పురాతన భాగాలతో కూడిన దేశం) నిజం అయితే విభజించబడిన భారతదేశం ఒక పీడకల” అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు.

Read Also: Acting For Pension: పెన్షన్‌ కోసం అంధురాలిగా నాటకం.. ఏకంగా 15 ఏళ్ల పాటు.. కానీ చివరికి..

భారత్‌, పాకిస్తాన్ మధ్య చేదు సంబంధాలను ప్రస్తావిస్తూ, ఇతరులపై దాడులకు పిలుపునిచ్చే సంస్కృతికి భారతదేశం చెందినది కాదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు.”భారత్‌ పాకిస్థాన్‌పై దాడి చేయాలని నా ఉద్దేశ్యం కాదు. అస్సలు కాదు. ఇతరులపై దాడికి పిలుపునిచ్చే సంస్కృతికి మేము చెందము” అని ఆయన అన్నారు. “మేము ఆత్మరక్షణలో తగిన సమాధానం చెప్పే సంస్కృతి నుంచి వచ్చాము,” భగవత్ ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రస్తావిస్తూ, “మేము దీన్ని చేస్తాము, మేము చేస్తూనే ఉంటాము” అని జోడించాడు. భారత్‌ను విభజించడాన్ని పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు తప్పుగా చెబుతున్నారు. అందరూ తప్పుగా చెబుతున్నారని మోహన్ భగవత్ నొక్కి చెప్పారు.

Show comments