Mohan Bhagwat: మతం అవగాహన లేకపోవడం వల్లే అణచివేతలు , దౌర్జన్యాలు!
- మతం పేరుతో జరుగుతున్న అణచివేతలు, దౌర్జన్యాలు
- మతంపై అవగాహన లేకపోవడం వల్లే జరుగుతున్నాయ్
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మతం పేరుతో జరుగుతున్న అణచివేతలు, దౌర్జన్యాలన్నీ మతంపై అవగాహన లేకపోవడం వల్లే జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని అమరావతిలో మహానుభావ ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. మత ప్రాముఖ్యతను అభివర్ణిస్తూ.. దానికి సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మతం ఎప్పటి నుంచో ఉందని, దాని ప్రకారమే అన్నీ పని చేస్తాయన్నారు. అందుకే దానిని “సనాతనం” అంటారన్నారు. మతం గురించి అసంపూర్ణ జ్ఞానం కలిగి ఉండటం అధర్మానికి దారితీస్తుందని మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మతం పేరుతో జరుగుతున్న అణచివేతలు, అకృత్యాలన్నీ నిజానికి మతంపై అవగాహన లేకపోవడం వల్లనే జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
READ MORE: Teacher Kidnap Incident: మలుపులు తిరుగుతున్న టీచర్ కిడ్నాప్ వ్యవహారం
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అంతకుముందు శుక్రవారం పుణెలో ఇండియా-ది విశ్వగురు అనే అంశంపై సహజీవన్ వ్యాఖ్యానాల కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ మోహన్ భగవత్ మాట్లాడారు. ప్రస్తుత కాలంలో మందిర్-మసీద్ వివాదాలు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను బయటకు తీసి తాము కూడా హిందూ నాయకులం కావొచ్చని కొందరు అనుకుంటున్నారు.. కానీ, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కలుపుగోలు సమాజాన్ని మోహన్ భగవత్ సమర్థించారు. మన దేశం సామరస్యంగా ఉంటుందనే విషయాన్ని.. ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్లో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామన్నారు. తన అభిప్రాయాన్ని చెప్పడానికి రామకృష్ణ పరమహంస బోధనలను ఉదహరించారు.
READ MORE: Chennai: ఉద్యోగులకు టాటా కార్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్.. చెన్నై సంస్థ గిఫ్ట్స్..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!