NTV Telugu Site icon

Mohan Bhagwat: మతం అవగాహన లేకపోవడం వల్లే అణచివేతలు , దౌర్జన్యాలు!

Mohan Bhagwat

Mohan Bhagwat

మతం పేరుతో జరుగుతున్న అణచివేతలు, దౌర్జన్యాలన్నీ మతంపై అవగాహన లేకపోవడం వల్లే జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని అమరావతిలో మహానుభావ ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. మత ప్రాముఖ్యతను అభివర్ణిస్తూ.. దానికి సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మతం ఎప్పటి నుంచో ఉందని, దాని ప్రకారమే అన్నీ పని చేస్తాయన్నారు. అందుకే దానిని “సనాతనం” అంటారన్నారు. మతం గురించి అసంపూర్ణ జ్ఞానం కలిగి ఉండటం అధర్మానికి దారితీస్తుందని మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మతం పేరుతో జరుగుతున్న అణచివేతలు, అకృత్యాలన్నీ నిజానికి మతంపై అవగాహన లేకపోవడం వల్లనే జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

READ MORE: Teacher Kidnap Incident: మలుపులు తిరుగుతున్న టీచర్ కిడ్నాప్ వ్యవహారం

అంతకుముందు శుక్రవారం పుణెలో ఇండియా-ది విశ్వగురు అనే అంశంపై సహజీవన్‌ వ్యాఖ్యానాల కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడారు. ప్రస్తుత కాలంలో మందిర్‌-మసీద్‌ వివాదాలు భారీగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను బయటకు తీసి తాము కూడా హిందూ నాయకులం కావొచ్చని కొందరు అనుకుంటున్నారు.. కానీ, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కలుపుగోలు సమాజాన్ని మోహన్ భగవత్ సమర్థించారు. మన దేశం సామరస్యంగా ఉంటుందనే విషయాన్ని.. ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్‌లో కూడా క్రిస్మస్‌ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామన్నారు. తన అభిప్రాయాన్ని చెప్పడానికి రామకృష్ణ పరమహంస బోధనలను ఉదహరించారు.

READ MORE: Chennai: ఉద్యోగులకు టాటా కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్.. చెన్నై సంస్థ గిఫ్ట్స్..