ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ స్పీడ్ గా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల నోటు రద్దు నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం అంటూ వ్యాఖ్యానించాడు. గత కొంతకాలంగా సమాజంలో రెండు వేల నోటు ఎక్కడా కనిపించడంలేదు.. ఈ డబ్బు దాచేసిన బ్లాక్ మనీదారులు ఈ దెబ్బకు బయటకు రావాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు.
Also Read : Anasuya: బికినీలో అనసూయ.. పిల్లల ముందు ఏంటీ ఈ చండాలం
అవినీతిపై నరేంద్ర మోడీ సమర శంఖారావం పూరించారు అని సోము వీర్రాజు అన్నారు. బ్రాందీ షాపులలో ఎక్కువుగా రెండు వేల నోట్లు ఇప్పుడు మార్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. అయినా ఆ రెండు వేల నోటు బ్యాంకులోనే మార్చాలనే విషయం వారు గుర్తించాలి.. రాష్ట్రంలో కొన్ని వర్గాల ఎన్.జీ.ఓ నాయకులు కార్మిక నాయకులుగా మారిపోయారంటూ సోము విమర్శించారు. ప్రజలకు అతి దగ్గరగా ఉండే ఉద్యోగ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు రెగ్యులర్ గా ప్రకటనలు ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఉందా.. లేదా ఒక పారిశ్రామిక రంగం ఉందా అనేది అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
Also Read : Air travel for pilgrims: సీనియర్ సిటిజన్స్‌కు బంఫర్ ఆఫర్.. దేశంలో తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్..
సీఎం పరిపాలిస్తున్నాడా.. లేదా ఈ నాయకులే పాలిస్తున్నారా.. ఉద్యోగస్తులు కార్మిక నాయకులుగా మారిపోయి జీతాలు లేవని ఆవేదన వెలిబుచ్చుతున్నారు అంటూ సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్రామాల్లో వైసీపీ సర్పంచులు లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆయన ఆరోపించారు. 6 నెలలుగా రాష్ట్రంలో 2000 నోటు కనిపించడం లేదు.. 2000 నోటు రద్దు చేయడం వల్ల సామాన్యులకు ఎటువంటి నష్టం లేదు అని సోము వీర్రాజు తెలిపారు.
