కొమురం భీం జిల్లా కేంద్రంలో తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు తమపై దాడులు చేస్తున్నారని తెలిపారు. నిన్న జరిగిన బూత్ నెం.90లో.. బీఆర్ఎస్ నేతలు ఒక వ్యక్తి కూర్చుని పెట్టి మరీ రిగ్గింగ్ కు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. మొదటి నుండే చెబుతున్నా.. ఇక్కడి పోలీసుల మీద నమ్మకం లేదని.. నిన్న తమపై దాడులకు పాల్పడిన వారిన ఇంత వరకు పట్టుకోలేదని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక్కడి పోలిసులు ఒకే వర్గానికి సపోర్టుగా వ్యవహరిస్తున్నారు.. అంత గొడవ జరుగుతున్నా ఏ ఒక్క పోలీసు అధికారి స్పందిచలేదని పేర్కొన్నారు. పోలీసులు ఖాకీ చొక్కా విప్పి గులాబీ కండువాలు వేసుకోవాలని విమర్శించారు.
Read Also: Electricity bill: రూ.5000 కరెంట్ బిల్లుకు, రూ. 195 కోట్ల రసీదు.. ఏం జరిగిందంటే..?
ఒక మాజీ IPS అధికారిగా చెబుతున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు గుండా రాజకీయాలు చేస్తున్నారు.. వారికి ప్రజా కోర్టులో ప్రజలే శిక్ష వేస్తారని ఆరోపించారు. రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించాలని చెప్పారు. ఇదిలా ఉంటే.. పోలీసుల పైనే దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. తమ బీఎస్పీ నాయకులపై దాడులకు దిగిన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెలిపారు. లేకుంటే రానున్న రోజుల్లో వారికి ప్రజలే బుద్ది చెబుతారని ప్రవీణ్ కుమార్ అన్నారు.
Read Also: Ministe RK Roja: ఇంత బడ్జెట్‌తో ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ క్రీడలు నిర్వహించలేదు..