Site icon NTV Telugu

Motorola Edge 50 Pro: డీల్ అదిరింది.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ. 17000 ల డిస్కౌంట్.. ప్రీమియం ఫీచర్లు

Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro

ప్రీమియం ఫీచర్లతో మీడియం రేంజ్ బడ్జెట్ లో కొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ డీల్ మిస్సవ్వకండి. Motorola Edge 50 Pro మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఇది ప్రస్తుతం Amazonలో 39 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్‌తో లిస్ట్ అయ్యింది. ఇంకా, కంపెనీ ఈ ఫోన్‌పై అద్భుతమైన బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్స్ ను కూడా అందిస్తోంది. ఈ ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద డిస్ప్లే, అద్భుతమైన కెమెరా నాణ్యతను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ 125W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సోపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కలిగి ఉంది.

ఈ మోటరోలా ఫోన్ అసలు ధర రూ.41,999, కానీ మీరు ప్రస్తుతం దీన్ని అమెజాన్‌లో రూ. 25,490కి కొనుగోలు చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్స్ తో రూ.1,000 తగ్గింపును, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికలతో రూ.1,500 వరకు తగ్గింపును పొందొచ్చు. అదనంగా, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్స్ తో రూ.1,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఫోన్ కొనుగోలు చేసినప్పుడు మీరు Amazonలో 5% వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. రూ.7,613 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMIతో ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫీచర్లు

ఫీచర్ల విషయానికొస్తే, ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 12GB వరకు RAM, 256GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది 125W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది.

Exit mobile version