NTV Telugu Site icon

CM Chandrababu: గ్రీన్ ఎనర్జీ రూపంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు..

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు చిట్ చాట్ నిర్వహించారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుంది.. మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పంపడ్ స్టోరేజ్ విద్యుత్ ను పూడిమాడకకు తెచ్చి వాటి ద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఉత్పత్తయ్యే హైడ్రోజన్ తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని చెప్పారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది.. దీంతో ఎగుమతులు పెరిగి మనకి లాభం వస్తుందని పేర్కొన్నారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందన్నారు. ఎన్టీపీసీలో బొగ్గు మండించటం ద్వారా వచ్చే కార్బన్ డయాక్సయిడ్‌ని పూడిమడక తెచ్చి హైడ్రోజన్ ఉత్పత్తికి వాడితే కాలుష్యం తగ్గుతుందని సీఎం తెలిపారు.

LIC Scheme: స్కీమ్ అంటే ఇది కదా.. సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రతి నెల రూ. 12 వేలు పొందండి

గ్రీన్ కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ను టెకోవర్ చేసి గ్రీన్ ఆమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్లాంట్ మీద రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు.. కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతులు జరుగుతాయని అన్నారు. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్సెడ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు పెడుతోంది.. ఒక్కో కేంద్రం రూ.130 కోట్ల పెట్టుబడి పెడుతున్నారని వెల్లడించారు. బయోగ్యాస్ కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుంది.. ఈ గడ్డి పెంచటానికి ఎకరాకు రూ.30 వేల కౌలు రైతులకు రిలయన్స్ చెల్లిస్తుందని చంద్రబాబు చెప్పారు. ఈ కేంద్రాల వల్ల ఉద్యోగాలు వచ్చి, గ్యాస్ ఉత్పత్తిలో వచ్చే వ్యర్ధాలు భూసారం పెంచేందుకు ఎరువుగానూ ఉపయోగపడుతుందని అన్నారు. బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ స్వాపింగ్ బ్యాటరీలు మోడల్‌ని కుప్పంకి తెచ్చింది.. కుప్పంలో సూర్యఘర్ అమల్లో ఉన్న ఇళ్లకు స్వాపింగ్ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకునేందుకు ఇంటి యజమానికి డబ్బులు చెల్లిస్తుందని అన్నారు. ఇది కుప్పం సూర్యఘర్ ఇంటి వాసులకు అదనపు ఆదాయం కానుందని ముఖ్యమంత్రి తెలిపారు.

MP: ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో దాచిన ప్రియుడు.. 10 నెలల తర్వాత గుర్తింపు..

సౌర విద్యుత్ ఉత్పత్తి పై కొత్త ఆలోచనలు చేస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నామని చెప్పారు. మిగిలిన వారికి కూడా సౌర ఫలకాల ఏర్పాటుకు కేంద్ర రాయితీ పోను మిగిలిన ఫలకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది.. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చే వరకూ కొంత మొత్తం విద్యుత్ వెనక్కి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చాక యూనిట్ మొత్తం ఇంటి యజమానికి అప్పగిస్తామని వెల్లడించారు. కుప్పంలో కొంతమందికి మానసిక ఎదుగుదల సమస్యలు, వినికిడి, మాటలు రాని సమస్యలు ఉన్నాయి.. పిల్లల్లో సృజనాత్మకత పెంచటానికి యాప్‌ల సాయంతో శిక్షణ ఇస్తున్నారని సీఎం తెలిపారు. ఇది సత్ఫలితాలు ఇస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

Show comments