NTV Telugu Site icon

SS Rajamouli Family: డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీకి తృటిలో తప్పిన ప్రమాదం.. 28వ అంతస్థులో..!

Ss Rajamouli Family

Ss Rajamouli Family

SS Rajamouli Family panicked after Small Earthquake hits Japan: ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఫ్యామిలీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న జక్కన ఫ్యామిలీ.. భూకంపం బారి నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాము 28వ అంతస్థులో ఉండగా భూమి కంపించిందని, తాను భయాందోళనకు గురయ్యానని కార్తికేయ పేర్కొన్నారు.

‘మేం 28వ అంతస్తులో ఉన్నాం. బిల్డింగ్ నెమ్మదిగా కదలడం ప్రారంభమైంది. అది భూకంపం అని గ్రహించడానికి మాకు కొంత సమయం పట్టింది. నేను భయాందోళనకు గురయ్యా. కానీ మా చుట్టూ ఉన్న జపనీయులందరూ ఎలాంటి ఆందోళన చెందలేదు. ఏదో వర్షం పడుతున్నంత ఈజీగా లైట్ తీసుకున్నారు. మొత్తానికి మేం భూకంపాన్ని ఎక్స్​పీరియెన్స్ చేశాం’ అని ఎస్ఎస్ కార్తికేయ ఎక్స్‌లో పేర్కొన్నాడు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌ని ఫోటో తీసి ఆయన షేర్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజమౌళి ఫ్యామిలీ సేఫ్‌గా ఇండియాకి తిరిగి రావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: IPL 2024: ఐపీఎల్‌ 2024కు మహ్మద్‌ షమీ దూరం.. గుజరాత్‌ జట్టులోకి కేరళ స్పీడ్‌స్టర్‌!

భూకంప తీవ్రత 5.3గా నమోదయిందని అమెరికా జియోలాజికల్‌ సర్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. తూర్పు జపాన్‌లోని దక్షిణ ఇబారకి ప్రిఫెక్చర్‌లో 46 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ రాజమౌళి ఫ్యామిలీ జపాన్ పర్యటనలో ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో తెరకెక్కించిన గ్లోబల్ హిట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్ కోసం వారు అక్కడికి వెళ్లారు.

Show comments