RR vs SRH Playing XI: డూ ఆర్ డై మ్యాచ్.. నేడే ఎలిమినేర్ మ్యాచ్.! ప్లేయింగ్ XI ఇదే..
- ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్
- న్యూ చండీగఢ్ వేదికగా..
- రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్య మ్యాచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RR vs SRH Playing XI: ఐపీఎల్ 2026లో మరో కీలక పోరు నేడు జరగనుంది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో రెండు జట్ల బలం విధ్వంసకర బ్యాటింగ్ కావడంతో అభిమానులు హైస్కోరింగ్ థ్రిల్లర్‌ను ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తో అమితుమీ తేల్చుకోనుంది.
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌పై ఇప్పటికే రెండు విజయాలు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం ఆ జట్టుపై వరుసగా ఆరు విజయాలతో ఆధిపత్యం కొనసాగిస్తోంది. అయితే న్యూ చండీగఢ్ మైదానంలో ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన రాజస్థాన్, హోమ్ కండిషన్స్‌పై నమ్మకంగా ఉంది. రాజస్థాన్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మంచి ఫామ్ లో ఉండడంతో అందరి ద్రుష్టి అతనిపైనే ఉన్నాయి. ఈ సీజన్లో 230కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 583 పరుగులు చేసిన అతడు ఇప్పటికే హైదరాబాద్‌పై 37 బంతుల్లో సెంచరీ బాదాడు. మరోవైపు జొఫ్రా ఆర్చర్ కొత్త బంతితో ఎంత ప్రమాదకారో తెలిసిందే. మరోవైపు కెప్టెన్ రియాన్ పరాగ్ స్వల్ప గాయంతో బాధపడుతున్నప్పటికీ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అలాగే రవీంద్ర జడేజా ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలు ఉన్నాయి. అతడు పూర్తిగా కోలుకోకపోతే రవి బిష్ణోయ్ జట్టులోకి రావచ్చు.
Also Read
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. ఈ సీజన్ ఆరంభంలో నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయమే సాధించిన ఆ జట్టు తర్వాత అద్భుతంగా రాణించి ఇప్పుడు ప్లేఆఫ్స్ కు చేరుకుంది. రాజస్థాన్‌పై 57 పరుగుల విజయంతో మొదలైన విజయయాత్ర వరుసగా ఐదు గెలుపులతో ప్లేఆఫ్స్ వరకు తీసుకువచ్చింది. ప్రస్తుతం జట్టులోని టాప్ ఆర్డర్ అద్భుత ఫామ్‌లో ఉంది. ఇక హెన్రిచ్ క్లాసేన్ ఈ సీజన్లో ఇప్పటికే 600కు పైగా పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు కూడా అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఈ ఎలిమినేటర్‌లో అభిషేక్ 37 పరుగులు, ఇషాన్ 31 పరుగులు చేస్తే ఒకే సీజన్లో ఒక జట్టు నుంచి ముగ్గురు బ్యాటర్లు 600+ పరుగులు చేసిన తొలి జట్టుగా SRH చరిత్ర సృష్టించనుంది.
బౌలింగ్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక పాత్ర పోషించనున్నాడు. ముఖ్యంగా రియాన్ పరాగ్‌పై అతడికి మంచి రికార్డు ఉంది. అలాగే హర్షల్ పటేల్ కూడా రాజస్థాన్‌పై మంచి రికార్డు ఉండటంతో తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. న్యూ చండీగఢ్ పిచ్ ఈ సీజన్లో భారీ స్కోర్లకు వేదిక. ఈ మైదానంలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 210 పరుగులు. ఇప్పటివరకు ఈ పిచ్‌పై జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ చేజింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. డ్యూ ప్రభావం కూడా రెండో ఇన్నింగ్స్‌లో ఉండే అవకాశం ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (WK), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, ప్యాట్ కమిన్స్ (C), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, హర్షల్ పటేల్/ప్రఫుల్ హింగే.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (W), రియాన్ పరాగ్ (C), డోనోవన్ ఫెరీరా, దాసున్ శనక, శుభమ్ దూబే, రవీంద్ర జడేజా/రవీ బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, యశ్ రాజ్ పుంజా, బృజేష్ శర్మ.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!