NTV Telugu Site icon

Virat Kohli-IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లీ!

Virat Kohli Century Rcb

Virat Kohli Century Rcb

Virat Kohli Slams 8th IPL Century: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 7,500 పరుగుల మైలురాయిని అందుకున్న మొదటి క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ ఈ అరుదైన రికార్డు అందుకున్నాడు.

ఇప్పటివరకు 242 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 130.36 స్ట్రైక్ రేట్‌తో 7575 పరుగులు చేశాడు. ఐపీఎల్‍లో 7 వేల మార్క్ పరుగులను కూడా మరే బ్యాటర్ చేయలేదు. ఐపీఎల్‍లో అత్యధిక పరుగుల రికార్డు విరాట్ పేరిటే ఉంది. టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ 221 మ్యాచ్‌లలో 6754 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 180 మ్యాచ్‌లలో 6545 రన్స్ బాదాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (6280 పరుగులు-246 మ్యాచ్‌లు), మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా (5528 పరుగులు-205 మ్యాచ్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Also Read: Pawan Kalyan: నేడు అనకాపల్లిలో జనసేన చీఫ్ రోడ్ షో..

రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. కోహ్లీకి ఇది 8వ ఐపీఎల్‌ సెంచరీ. ఐపీఎల్‍లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు కూడా విరాటే కావడం విశేషం. విరాట్ సెంచరీతో చెలరేగినా.. ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 3 వికెట్లకు 183 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (100 నాటౌట్‌; 58 బంతుల్లో 9×4, 4×6) చెలరేగడంతో రాజస్థాన్‌ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Show comments