Royal Saree :ఈ చీర ఖరీదు అక్షరాలా రూ.21.9 లక్షలు.ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ చీర ఖరీదు మహా అయితే ఎంత ఉంటుంది.. లక్ష బాగా డబ్బులు ఉన్న వాళ్ళు.. ఇంకా ఎక్కువలో కావాలంటే కాస్త ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా చేయిస్తారు.. అయితే మామూలు షాప్ లలో లక్షల విలువ చేసే చీర ఉండటం ఎప్పుడైనా చూసారా? ఈ చీర ధర పెడితే ఓ సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కొనుక్కోవచ్చు. సోషల్ మీడియాలో ఈ చీర ధర నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఎందుకంటే ఆ చీర ధర అక్షరాలా రూ.21 లక్షలు..ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రూ.21.9 లక్షలు.. అంత ఖరీదు పెట్టే చీర ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ బట్టల షాపులో అమ్మకానికి పెట్టిన ఈ చీర మార్కెట్ ను షేక్ చేస్తోంది. శ్వేతవర్ణంలో అందంగా మెరిసిపోతున్న ఈ చీర షాపులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చీరకు వినియోగించిన వస్త్రం, తయారీ విధానం, కుట్లు వంటివి ఈ చీరకు ఈ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. పైగా ఈ చీర తయారీకి రెండేళ్లు పట్టిందట..యూపీలో చికన్ వర్క్ వస్త్రాలకు మంచి డిమాండ్ఉంటుంది. మరి ముఖ్యంగా కాన్పూర్, లక్నోలలో ఈ చికన్ వర్క్ కు ప్రసిద్ది చెందాయి. ఇక్కడ అమ్మే ప్రతీ వస్త్రం దాదాపు చికన్ వర్క్ తో తయారు చేసినవే ఉంటాయి. అక్కడ మహిళలు ఈ చికన్ వర్క్ కుట్టటంలో మంచి ఎకస్పెర్ట్స్..
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఈ చీరకు షిఫాన్, చికన్‌కారీ కుట్లు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పారు షాపు నిర్వాహకులు. యూపీ రాజధాని లక్నోను ఒకప్పుడు నవాబుల నగరంగా పిలిచేవారు. అదే మాట ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే అత్యంత ఖరీదైన చీరలకు లక్నో సిటీ బాగా ఫేమస్. ఈ రూ.21 లక్షల ఖరీదైన ఈరాయల్ శారీని ఫ్యాషన్ స్టోర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చీర ఖరీదు అక్షరాల 21లక్షల 9వేల రూపాయలు.. ఈ చీరను తయారు చెయ్యడానికి స్పటికాలను ఉపయోగిస్తారు..ఈ చీరను ఒకే వైర్ పై తయారు చేశారని..అందులో అమర్చిన నెట్ కూడా ప్రత్యేకమైనది తెలిపారు. ఇటువంటిదే మరోచీర మా షాపులో ఉందని దాని ఖరీదు రూ.10లక్షలు అని తెలిపారు. దాదాపు అంతే ధరతో మరో చీర కోసం ఆర్డర్ వచ్చింది ఆ చీర తయారీలో ఉందని చెబుతున్నారు..ఇకపోతే 32 రకాల చికన్ వర్కులు ఈ చీరలో ఉన్నాయని తెలిపారు. ఈ చీర ఇంత ఖరీదు కావటానికి ఇదే మెయిన్ అని ప్రముఖులు చెబుతున్నారు.. అది అసలు చీర కథ..
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!