Site icon NTV Telugu

Falaknuma: పాతబస్తీలో నడిరోడ్డుపై రౌడీషీటర్‌ మాస్ యుద్ధీన్ దారుణ హ*త్య..

Falaknuma

Falaknuma

Falaknuma: హైదరాబాద్‌ నగరంలోని ఫలక్‌నుమా ప్రాంతంలో దారుణ హత్య కలకలం రేపింది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ మాస్ యుద్దీన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ హత్య ఘటనకు సంబంధించిన సమాచారం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఇకపోతే, మాస్ యుద్దీన్ మూడురోజుల క్రితమే వివాహితుడయ్యాడు. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడిని అకాల మరణం కలవరిస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

గుర్తుతెలియని దుండగులు మాస్ యుద్దీన్‌పై కత్తులతో దాడి చేసి అతన్ని అక్కడికక్కడే హతమార్చారు. తీవ్రంగా గాయపడిన యుద్దీన్, రక్తపు మడుగులో చనిపోయాడు. దాడి తీరు చూస్తే.. మృతికి కారణమైన వ్యక్తులు ముందుగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మాస్ యుద్దీన్‌కు కొందరు ప్రత్యర్థులు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతని ప్రత్యర్థులే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు సంఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సమీప సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ హత్యపై నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా.. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Exit mobile version