NTV Telugu Site icon

Rotten Coconut Business: బుర్రుండాలే కానీ.. తేలిగ్గా బిలియనీర్ కావొచ్చు

Rotten Coconuts

Rotten Coconuts

Rotten Coconut Business: డబ్బు ఎలా సంపాదించాలని చాలా మంది ఉన్న పనిని వదులుకుని టైం వేస్టు చేస్తూ అదేపనిగా ఆలోచిస్తుంటారు. కానీ ఆ టైంలో కొంచెం బుర్రకు పదును పెడితే కోట్టు సంపాదించే మార్గాలెన్నో ఉన్నాయి. కష్టించి పని చేస్తే ఏ వ్యాపారంలోనైనా లాభాలు గడించవచ్చని ఇప్పటికే ఎందరో నిరూపించారు. పనికిరావు.. అనుకున్న వాటితోనే కోట్లు సంపాదించి వావ్ అనిపించేశారు. అలాంటి ఓ ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా కొబ్బరికాయ కుళ్లితే ఏం చేస్తాం.. డస్ట్ బీన్లో పడేస్తారు.. కానీ పాడైన కొబ్బరి కాయలతో కోట్లు సంపాదించొచ్చని మీకు తెలుసా. కుళ్లిన కురిడీల నుంచి తీసే నూనెను సబ్బుల తయారీలో వినియోగిస్తుంటే.. కుళ్లిన కాయలను కాశీలో శవాలను కాల్చేందుకు ఉపయోగిస్తున్నారని టాక్. గోదావరి జిల్లాల్లో కుళ్లిపోయిన కొబ్బరి కాయలతో రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. కోనసీమ కొబ్బరికాయలకు ఫేమస్. అక్కడి నుంచే పలు ప్రాంతాలకు కొబ్బరి కాయలు సరఫరా అవుతాయి.

Read Also: Health News: చలి అని ముసుగు తన్ని పడుకుంటే.. మీకు మూడినట్లే..?

అలా సరఫరాలో పగిలిన కొబ్బరికాయలను ఏరి పక్కన పడేస్తుంటారు వ్యాపారులు. వాటిని కొందరు రూపాయి, రెండు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కుళ్లిన కొబ్బరి కాయలను ప్రాసెసింగ్, రవాణా చార్జీలతో కలిపి ఉత్తరాదిలో ఒక్కో కాయ రూ.8 నుంచి రూ.10కి విక్రయిస్తున్నారు. కుళ్లిన కొబ్బరి కాయల్లో వచ్చే కొబ్బరి గుజ్జును తీసి నాలుగైదు వారాలపాటు ఎండబెట్టి కొబ్బరి నూనె తీస్తారు. ఇలా తీసిన నూనె మార్కెట్లో రూ.30 నుంచి రూ.40 చొప్పున అమ్ముడుపోతుంది. కుళ్లిన కొబ్బరి కాయల చిప్పలను పొడి చేసి దోమల నివారణకు వాడే కాయిల్స్‌లో వినియోగిస్తున్నారు. ఈ చిప్పలు టన్ను రూ.5 వేల ధర పలుకుతోంది.

Read Also: Plastic Waste: ఎక్కడ చూసినా చెత్తే.. ఇలాగే ఉంటే మన బతుకులు అంతే?

కాశీ వంటి క్షేత్రాల్లో కొబ్బరి కాయలతో అంత్యక్రియలు నిర్వహిస్తే పుణ్యం వస్తుందని ఉత్తరాది రాష్ట్రాల వారి నమ్మకం. శవాల దహనానికి కుళ్లిన కొబ్బరి కాయలను ఎండబెట్టి వినియోగిస్తున్నారు. కాయలను సంచులలో నింపి లారీల ద్వారా కాశీ, మధుర తదితర క్షేత్రాలకు ఎగుమతి చేస్తున్నారు. నాణ్యమైన కొబ్బరి కాయలు వినియోగించాలంటే కాయ రూ.20 పైనే ఉంటుంది. అంత ధర భారమనే ఉద్దేశంతో కుళ్లిన కొబ్బరి కాయలను శవ దహనానికి వినియోగిస్తున్నారని గోదావరి జిల్లాల నుంచి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతిచేసే వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి రోజుకు మూడు లారీలు అంటే సుమారు లక్ష కాయలు. కాశీకి కుళ్లిన కొబ్బరి కాయలు ఎగుమతి అవుతున్నాయి. కార్తీక మాసంతో పాటు పూజల సమయాలలో హోమాల నిర్వహణ, మొక్కులు తీర్చుకునే క్రమంలో నదులలో వదిలేందుకు ఉత్తరాది భక్తులు ఈ కొబ్బరి కాయలను బస్తాల కొద్దీ కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇవి రెట్టింపు ధర పలుకుతున్నాయి. కుళ్లిన కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, చిప్పలు అన్నీ కలిపి ఉభయ గోదావరి జిల్లాల నుంచి జరిగే లావాదేవీలు ఏటా రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా.