Site icon NTV Telugu

Roshan-Emo Emo Idi : ‘ఏమో ఏమో ఇది’ అంటూ మొదలైన రోషన్.. ప్రేమాయణం!

Roshan Emo Emo Edhi Movie

Roshan Emo Emo Edhi Movie

రీసెంట్ గా ‘ఛాంపియన్’ సినిమాతో హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో రోషన్, ఇప్పుడు ‘ఏమో ఏమో ఇది’ అనే ఒక క్యూట్ రొమాంటిక్ డ్రామాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ అందుకుంటున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నాయి. అయితే

Also Read: Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్ ‘DC’ సర్ప్రైజ్.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే అప్‌డేట్!

తాజాగా విడుదలైన ‘ది ఫస్ట్ బ్రీజ్’ వీడియో ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఇందులో రోషన్ తన తల్లితో అమ్మాయిల గురించి చాలా కామెడీగా డిస్కషన్ చేస్తాడు. “అమ్మాయిలు చాలా డేంజర్ మమ్మీ.. సింగిల్‌గా ఉండటమే సేఫ్” అని చెప్పే రోషన్, గ్లింప్స్ చివర్లో హీరోయిన్ ప్రీతి ముకుందన్‌ను చూసి మొదటి చూపులోనే ఫిదా అయిపోతాడు. ‘కన్నప్ప’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ప్రీతి ముకుందన్, ఈ వీడియోలో చాలా కలర్‌ఫుల్‌గా, క్లాసీగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలవనుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

Exit mobile version