Site icon NTV Telugu

Bubblegum : డిజాస్టర్ దిశగా సాగుతున్న రోషన్ కనకాల బబుల్‌గమ్ మూవీ..

Whatsapp Image 2024 01 02 At 11.46.16 Am

Whatsapp Image 2024 01 02 At 11.46.16 Am

స్టార్ యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయడు రోషన్ కనకాల నటించిన బబుల్ గమ్ మూవీ 2023 డిసెంబర్ 29 న విడుదల అయింది. గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నాలుగు రోజుల్లో ఈ మూవీ కోటి కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది.ప్రస్తుతం బబుల్ గమ్ మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోంది.తొలిరోజు యాభై లక్షల వసూళ్ల ను రాబట్టిన ఈ మూవీ నెగెటివ్ టాక్ కారణంగా తర్వాత రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. రెండు రోజు నలభై ఐదు లక్షలు అలాగే మూడో రోజు కేవలం యాభై రెండు లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి.సోమవారం హాలీడే రోజు కూడా ఈ మూవీ డిస్సపాయింట్ చేసింది. కేవలం 47 లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో కోటి తొంభై లక్షల గ్రాస్ మరియు తొంభై లక్షలకు పైగా షేర్‌ను బబుల్‌గమ్‌ మూవీ రాబట్టింది.

మంగళవారం రోజు వసూళ్లు మరింత తగ్గనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ గా డైరెక్టర్ రవికాంత్ పేరేపు తెరకెక్కించాడు. క్షణం మరియు కృష్ణ అండ్ ఈజ్ లీలా సినిమాల తర్వాత రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన మూవీ ఇది.బబుల్‌గమ్ మూవీ లో మానస చౌదరి హీరోయిన్‌ గా నటించింది.ఈ సినిమా కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం అలాగే ఈ పాయింట్‌ తో గతంలో తెలుగులో చాలా సినిమాలు రావడంతో బబుల్‌గమ్ ఫస్ట్ డే నుంచే నెగెటివ్ టాక్‌ వచ్చింది.దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్‌ తో బబుల్ గమ్ మూవీ తెరకెక్కింది. అటు ఇటుగా థియేట్రికల్ రన్‌లో ఈ మూవీ కోటిన్నర వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతల కు ఈ మూవీ భారీగానే నష్టాలు మిగిల్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Exit mobile version