NTV Telugu Site icon

Viral Video : కొడుకుకు నరకం చూపిన తల్లి.. మీద కూర్చొని, తల నేలకేసి కొడుతూ..ఛాతిపై కొరుకుతూ

Whatsapp Image 2024 07 18 At 10.50.30 Am

Whatsapp Image 2024 07 18 At 10.50.30 Am

Viral Video : ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని ఝబ్రేదాలో ఓ క్రూరమైన తల్లి తన బిడ్డను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి కూడా తన బిడ్డను ఇలా ఇంత దారుణంగా కొట్టగలదన్న విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వాస్తవానికి ఒక తల్లి తన పిల్లలకు ఏ చిన్న ఆపద ఎదురైనా తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కాపాడుకుంటుంది. కానీ ఈ వీడియోలో తల్లి తన 12 ఏళ్ల చిన్నారిని ప్రాణాలు పోయేలా కొట్టడం చూసి అందరూ నీలో ఎంత క్రూరత్వం దాగుంది అంటూ తిట్టిపోస్తున్నారు.

ఓ తల్లి తన బిడ్డ పట్ల క్రూరంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు వీడియోను షేర్ చేసి తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియో వైరల్ కావడంతో, విషయం పోలీసులకు చేరింది. వారు తల్లిని సంప్రదించారు. తల్లి, తన బిడ్డను ఎందుకు ఇంత దారుణంగా కొట్టిందని ప్రశ్నించారు. ఈ రెండు నిమిషాల వైరల్ వీడియోలో ఒక మహిళ తన 12 ఏళ్ల బిడ్డను దారుణంగా కొట్టడం కనిపిస్తుంది. ఆ మహిళ అతడిని దారుణంగా కొట్టడమే కాకుండా అతని ఛాతీపై కూర్చొని తన తలను నేలపై కొట్టడం కూడా వీడియోలో కనిపిస్తుంది, తన తల్లి కొట్టిన దెబ్బతో బాధపడిన పిల్లవాడు పదే పదే నీరు అడిగాడు, కానీ ఆ స్త్రీ నీరు ఇవ్వడానికి బదులుగా అతడిని మరింత కొట్టింది.

Read Also:AP Crime: బిస్కెట్ల ఆశచూపి.. ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యం..! ఆపై హత్య..

చిన్నారిని కొడుతున్న సమయంలో మరొకరు వీడియో తీశారు. ఆ మహిళ ఝబ్రేదాలోని బట్టల దుకాణంలో పని చేస్తుంది. వీడియోతోపాటు ఆమె పేరు, చిరునామా కూడా తెలిసింది. ఝబ్రేదా పోలీసులు విచారణ కోసం మహిళ వద్దకు చేరుకున్నప్పుడు, ఆమె వీడియో చూసి ఆశ్చర్యపోయింది. ఝబ్రేదా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి అంకుర్ శర్మ మాట్లాడుతూ. విచారణ కోసం ఆమె ఇంటికి వెళ్లినప్పుడు తల్లి ఇల్లు ఝబ్రేదాలో ఉందని.. తనకు దేవబంద్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని తేలింది. ఇప్పుడు ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. దాడి గురించి పోలీసులు మహిళను అడగగా.. మహిళ తన ముగ్గురు పిల్లలతో ఝబ్రేదాలో నివసిస్తుంది. పిల్లల ఖర్చుల కోసం తన భర్త నుండి డబ్బు కావాలని, అతను ఇవ్వడం లేదని వెలుగులోకి వచ్చింది. పిల్లల ఖర్చుల కోసమే తల్లి కొడుకును కొడుతున్న వీడియోను భర్తకు పంపింది. భర్త ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశాడు.

ఈ కేసును చైల్డ్ వెల్ఫేర్ పర్యవేక్షణలో ఉంచుతామని, అందుకే చైల్డ్ వెల్ఫేర్‌కు పంపామని పోలీసులు తెలిపారు. చిన్నారిని మహిళ ఈ విధంగా కొట్టడంతో.. మహిళకు కౌన్సెలింగ్ అవసరమని పోలీసులు తెలిపారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసేందుకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఎంత కోపం ఉన్నప్పటికీ ఓ తల్లి ఇంతలా బిడ్డను కొట్టలేదని, ఇలాంటి కసాయి తల్లిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also:Dheeraj Mogilineni : చిన్న సినిమాలకు ఇక నుండి ఒకటే రూల్ ..అదేమంటే..?

Show comments