NTV Telugu Site icon

IPL 2023 : జడేజా, బెన్ స్టోక్స్ ఫోటో వైరల్.. రొనాల్డో- మెస్సీతో పోల్చుతున్న నెటిజన్స్..

Csk

Csk

మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే నాలుగు సార్లు టైటిల్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్స్ తన తొలి మ్యాచ్ ని గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. అయితే ఇప్పుడు సీఎస్కే ఫ్రాంఛైజీ పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. క్రికెట్ లో అత్యత్తమ ఆల్ రౌండర్స్ ఇద్దరు ఒకే చోటు కూర్చున్నారు. అదేనండి రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్ చెన్నై తరపున ఆడుతున్నారు.

Also Read : Ram Charan Birthday: మెగా అభిమానులకు అలర్ట్‌.. RC15 టైటిల్‌ రివీల్‌

CSK జట్టులో స్టార్‌గా ఉన్నా రవీంద్ర జడేజా.. T20 లీగ్ యొక్క 16వ ఎడిషన్‌కు ముందు వేలం సమయంలో బెన్ స్టోక్స్ ను సీఎస్కే కొనుగోలు చేసింది. ఒక శిక్షణా సెషన్‌లో, ఫుట్‌బాల్ క్రీడాకారులు లియోనెల్ మెస్సీ మరియు క్రిస్టియానో ​​రొనాల్డో ఒకే జట్టులో ఉన్నట్లుగా అభిమానులకు అనుభూతి చెందడంతో.. జడేజా, బెన్ స్టోక్స్ ఇద్దరు కలిసి కూర్చున్న ఫోటో వైరల్ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్‌లో ఈ ఫోటోను పంచుకుంది. కొంతమంది అభిమానులు స్టోక్స్‌ను భవిష్యత్ కెప్టెన్సీ అభ్యర్థిగా కూడా చూస్తున్నారు.. కాగా, MS ధోని తర్వాత సీఎస్కే ఫ్రాంచైజీని విడిచిపెడతారని తెలుస్తోంది. గత సీజన్‌లో రవీంద్ర జడేజాకు జట్టు బాధ్యతలు ఇచ్చినప్పటికి అతను నాయకుడిగా, ఆటగాడిగా విఫలం కావాడంతో తను కెప్టెన్సీని వదులుకున్నాడు. దీంతో 2022 సీజన్ మొత్తానికి జడేజా గాయం కారణంగా దూరం అయ్యాడు.

Also Read : Covid Cases Rise: దేశంలో మళ్లీ కరోనా కలవరం.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమావేశం

IPL 2023 వేలంలో.. కుర్రాన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. PBKSతో బిడ్డింగ్ వార్‌లో పాల్గొంది. అయితే వేలం 15.25 కోట్లు దాటిగానే రేసు నుంచి వైదొలిగింది. అయితే, CSK ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ స్టోక్స్ ను రూ. 16.25 కోట్లకు భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ తర్వాత ధోనీ ఫ్రాంచైజీ నుంచి ఆటగాడిగా మారాలని నిర్ణయించుకుంటే, అతను టెస్ట్ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా ఉన్న బెన్ స్టోక్స్ కు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. స్టోక్స్‌తో పాటు అజింక్యా రహానెని కూడా CSK బేస్ ధర రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో ఐపీఎల్ 2017లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరఫున ధోనీ, స్టోక్స్, రహానే కలిసి ఆడారు.