Site icon NTV Telugu

Rohit Sharma: నన్ను ఔట్ చేయడం సాధ్యమే కాదు.. పిల్లలతో హిట్ మ్యాన్.. వీడియో వైరల్

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో తన జట్టుకు ఆరో ట్రోఫీ అందించాలనే లక్ష్యంతో మైదానంలో తెగ కసరత్తులు చేస్తున్నాడు. అయితే మైదానం బయట ఆయన సరదా వ్యక్తిత్వంతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ను ప్లేఆఫ్‌కు నడిపించిన రోహిత్, జట్టు విజయ పరంపరను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. నేడు జరగబోయే పంజాబ్ కింగ్స్‌ తో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ పిల్లలతో గడిపిన సరదా క్షణాల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించిన చిన్న పిల్లలతో రోహిత్ మాట్లాడుతున్న సందర్భంలో ఓ చిన్నారి అడిగిన ప్రశ్నకు రోహిత్ సమాధానం వైరల్ గా మారింది.

Read Also: Punjab and Sindh Bank Recruitment 2025: డిగ్రీ అర్హతతో రిలేషన్‌షిప్ మేనేజర్ జాబ్స్.. మిస్ చేసుకోకండి

అక్కడ ఉన్న ఓ పిల్లడు “సర్, నిన్ను ఎలా చేయాలి?” అని అడగగా, దానికి రోహిత్ నవ్వుతూ.. “అది సాధ్యపడదు” అంటూ సరదాగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో చుసిన కొందరైతే ఏకంగా ఇది ప్రత్యర్థులకు హెచ్చరిక అంటూ కామెంట్స్ చేసేస్తున్నారు. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటన్స్‌పై 81 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్, తన జట్టును 20 పరుగుల తేడాతో గెలిపించి క్వాలిఫయర్ 2కు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో అతడి 50 బంతుల్లో 9 బౌండరీలు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

Read Also: Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!

ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం నాలుగు అర్ధశతకాలే చేసిన రోహిత్, ఇంకా ఎక్కువ ఫిఫ్టీలు చేయాలనుకున్నానని పేర్కొన్నాడు. నాలుగు అర్ధశతకాలు మాత్రమే చేశాను, మరిన్ని చేయాలనుకున్నాను. ఎలిమినేటర్‌లో ఆడటం ఎంత ముఖ్యమో తెలుసు. ఇది జట్టు విజయమే అని రోహిత్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అన్నాడు. ఇకపోతే, ప్లేఆఫ్ మ్యాచ్‌ల కోసం రోహిత్ శర్మకు కొత్త ఓపెనింగ్ పార్టనర్‌గా జానీ బెయిర్‌స్టో చేరాడు. రయన్ రికెల్టన్ దక్షిణాఫ్రికా టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం వెళ్ళిన తర్వాత బెయిర్‌స్టో అతని స్థానాన్ని భర్తీ చేశాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో రోహిత్, బెయిర్‌స్టో జోడీ తొలి వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యం అందించి తమ సమన్వయాన్ని చాటింది.

Exit mobile version