NTV Telugu Site icon

IND vs ENG: హే తమ్ముడు.. హీరో అవ్వాలనుకుంటున్నావా! సర్ఫరాజ్‌పై రోహిత్ ఫైర్

Rohit Sarfaraz Helmet

Rohit Sarfaraz Helmet

Rohit Sharma warns Sarfaraz Khan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. హెల్మెట్ పెట్టుకోకుండా ఫీల్డింగ్‌కు సిద్దమైన సర్ఫరాజ్‌ ఖాన్‌పై మండిపడ్డాడు. ‘హే తమ్ముడు.. హీరో అవ్వాలనుకుంటున్నావా?’ అని సర్ఫరాజ్‌ను మందలించాడు. ఈ ఘటన రాంచి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆటలో చోటుచేసుకుంది. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లేయర్స్ పట్ల రోహిత్‌కు ఉన్న జాగ్రత్త చూసి హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 47వ ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేశాడు. అయితే ఓవర్ మధ్యలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ మార్పులు చేశాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఫార్వర్డ్ షార్ట్ లెగ్ పొజిషనల్‌లో ఉంచాడు. అది ఫీల్డర్లకు ప్రమాదకరమైన ప్లేస్. అక్కడ ఫీల్డింగ్ చేసే ఏ ఆటగాడైనా హెల్మెట్ పెట్టుకుంటాడు. అయితే సర్ఫరాజ్ మాత్రం హెల్మెట్ లేకుండానే ఫీల్డింగ్‌కు సిద్ధమయ్యాడు. ఇది గమనించిన రోహిత్.. సర్ఫరాజ్‌పై సీరియస్ అయ్యాడు. ‘హే తమ్ముడు.. నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావా?’ అని మందలించాడు.

Also Read: Trisha Krishnan: ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష

వెంటనే సర్ఫరాజ్‌ ఖాన్‌ హెల్మెట్ తీసుకురమ్మని డగౌట్ వైపు సైగలు చేశాడు. కేఎస్ భరత్ హెల్మెట్ తీసుకుని వచ్చి ఇవ్వడంతో సర్ఫరాజ్ హెల్మెట్ ధరించి ఫీల్డింగ్ కొనసాగించాడు. నెట్టింట ఈ వీడియో వైరల్ అయింది. ఇక నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 152 పరుగులు అవసరం. మరో రెండు రోజుల ఆట ఉన్న నేపథ్యంలో రోహిత్ సేన గెలవడం పెద్ద కష్టమేం కాదు.

Show comments