NTV Telugu Site icon

Rohith Sharma: రోహిత్ మాట్లాడింది వారి గురించేనా? చిట్ చాట్ వీడియో వైరల్

Rohit

Rohit

Rohith Sharma: రోహిత్ శర్మ.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన హిట్‌మ్యాన్ తన అద్భుత బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అనేక రికార్డులను సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీల వ్యక్తిగా ఇంకా అనేక రకాల రికార్డులను కైవసం చేసుకొని తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ముంబై ఇండియన్స్ జట్టును 2013 నుంచి నాయకత్వం వహిస్తూ, ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ముంబైను ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపి చరిత్ర సృష్టించాడు. అయితే 2024 ఐపీఎల్ సీజన్‌లో హార్థిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడంతో రోహిత్ శర్మ ముంబై యాజమాన్యంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Read Also: Donald Trump: ట్రంప్ దెబ్బకు ఫార్మా ఇండస్ట్రీ విలవిల!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, లక్నో మెంటర్ జహీర్ ఖాన్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాక్టీస్ సమయంలో ఇద్దరూ సీరియస్‌గా మాట్లాడుతుండగా.. మధ్యలో రిషబ్ పంత్ రోహిత్ శర్మను వెనుక నుంచి హగ్ చేయడం కెమెరాలో రికార్డ్ అయ్యింది. కానీ, అదే సమయంలో రోహిత్ శర్మ జహీర్ ఖాన్‌తో చెప్పిన కొన్ని మాటలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. “చేయాల్సినప్పుడు అన్నీ చేశాను.. ఇప్పుడు నేను ఏమీ చేయవలసిన అవసరం లేదు” అని రోహిత్ శర్మ మాటలు ఇప్పుడు చర్చలకు దారి తీశాయి.

ఈ వీడియో బయటకు రావడంతో.. రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఉద్దేశించేలాగే ఉన్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే, కెప్టెన్సీ బాధ్యతలు లేని ఈ సీజన్‌లో రోహిత్ శర్మ పూర్తి స్వేచ్ఛతో బ్యాటింగ్‌కే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ 2024 సీజన్‌కి ముందుగా రోహిత్ శర్మను తప్పించి, హార్థిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో రోహిత్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సీజన్‌లోనే రోహిత్ ముంబై టీమ్‌ను వీడిపోతాడంటూ వార్తలు కూడా వచ్చాయి.

Read Also: O Yeong Su: ప్రముఖ నటుడుకి జైలు శిక్ష

ఈ నేపథ్యంలో రోహిత్ తాజాగా అన్న మాటలు అతను ముంబై యాజమాన్యంపై అసంతృప్తిగా ఉన్నాడని స్పష్టం చేస్తోంది. కెప్టెన్‌గా ఉండగా జట్టును విజయాల బాటలో నడిపించానని, ఇప్పుడు మాత్రం అతని బాధ్యతలు పూర్తయ్యాయని హిట్‌ మ్యాన్ సూచిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వీడియోపై సోషల్ మిడిల్ పెద్ద చర్చనే కొనసాగుతుంది. చూడాలి మరి ముందుముందు ఈ విషయమై రోహిత్ ఏమైనా స్పందిస్తాడేమో.