NTV Telugu Site icon

IND vs NED: ప్రపంచకప్‌లో 9 మంది బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి కాదు.. 31 ఏళ్ల ముందు..!

India 9 Bowlers

India 9 Bowlers

Three times a team used 9 bowlers in ODI World Cup innings: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ తరఫున మొత్తం 9 మంది బౌలింగ్ చేయడం విశేషం. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా జట్టులోని మిగతా అందరూ బౌలింగ్ చేశారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆర్ జడేజా.. బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు. వన్డే ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో తొమ్మిది మంది బౌలింగ్ చేయడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.

వన్డే ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో తొమ్మిది మంది బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. గతంలో రెండుసార్లు తొమ్మిది మంది బౌలింగ్ చేశారు. 1987లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 మందితో బౌలింగ్ వేసింది. 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ తరఫున 9 మంది బౌలింగ్ చేశారు. 31 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ తొమ్మిది మందితో బౌలింగ్ చేసింది.

Also Read: Shreyas Iyer Century: ఆ లక్ష్యంతోనే బ్యాటింగ్‌ చేశా.. సెంచరీపై శ్రేయస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి.. 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 5 బంతులు వేసి 7 పరుగులు ఇచ్చి.. ఓ వికెట్ సాధించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌ చెరో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి.. వికెట్ తీయలేకపోయారు. శ్రేయస్ అయ్యర్‌కు కూడా బంతిని ఇచ్చి ఉంటే బాగుండేదని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. రాహుల్, శ్రేయస్ ఏం పాపం చేసారు.. వారిని ఓ ఓవర్ ఇవ్వాల్సిందని నెటిజన్స్ రోహిత్ శర్మను ట్రోల్స్ చేస్తున్నారు.