Rohit Sharma Set To Create History in IPL: ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం (మార్చి 27) సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్ 2024 పాయింట్ల ఖాతాను తెరవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సొంతగడ్డపై ఎస్‌ఆర్‌హెచ్ తొలి మ్యాచ్ కావడంతో.. సన్ రైజర్స్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకంగా నిలవనుంది.
నేడు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్ ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకం. ఈ మ్యాచ్‌తో ముంబై తరఫున రోహిత్ 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తరఫున 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ నిలవనున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ 239 మ్యాచ్‌లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంఎస్ ధోనీ 221 మ్యాచ్‌లు ఆడాడు.
Also Read: Shivam Dube: ఇతర ఫ్రాంచైజీలకు.. చెన్నైకి అదే వ్యత్యాసం: దూబె
ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీకి ఆడుతున్న విషయం తెలిసిందే. చెన్నై ప్రాంచైజీపై రెండేళ్ల నిషేధం పడినపుడు ఎంఎస్ ధోనీ కొన్ని మ్యాచ్‌లు రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టుకు ఆడాడు. అలానే రోహిత్ కెరీర్ ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.