Site icon NTV Telugu

Rohit Sharma: మరోసారి తండ్రి కానున్న రోహిత్..? జూనియర్ హిట్ మ్యాన్ రాబోతున్నాడా..?

Rohit Sharma Ritika

Rohit Sharma Ritika

Rohit sharma – Ritika: ప్రస్తుతం టీమిండియా జట్టుకు క్రికెట్ నుండి సుదీర్ఘ విరామం లభించింది. ఈ సమయంలో ప్రతి ఒక్క టీమిండియా క్రికెట్ ఆటగాడు వారి కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ఇకపోతే టి20 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టి20 ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ముగిసిన శ్రీలంక టూర్లో రోహిత్ శర్మ వన్డేలకు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరించాడు. తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ లో అతడు ఆడనున్నాడు. ప్రస్తుతం లాంగ్ బ్రేక్ దొరకడంతో ఆయన వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. ఇదే క్రమంలో తాజాగా రోహిత్ శర్మ తన భార్య రితికతో కలిసి CEAT క్రికెటర్ రేటింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈవెంట్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Rape Case: ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. ఆపై కామానికి బలైన బాలిక..

ఈ ఈవెంట్ లో రోహిత్ శర్మ భార్య రితికను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.. రితిక మళ్లీ కడుపుతో ఉన్నట్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చిన్నపాటి బేబీ బంప్ తో ఉన్నట్లు ఈ వీడియోలో కనబడుతుంది. అయితే ఈ విషయం రోహిత్ శర్మ నేరుగా స్పందిస్తే తప్ప.. అది నిజమా..? అబద్దమా..? అన్న విషయం తెలుస్తుంది. ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.. అతి త్వరలోనే రోహిత్ జోడి జూనియర్ హిట్ మ్యాన్ కు జన్మ ఇవ్వబోతున్నట్లు కామెంట్ చేస్తున్నారు. రోహిత్ 2015లో రితిక ను వివాహం చేసుకోగా.. 2022 లో కూతురు సమైరా పుట్టింది.

Exit mobile version