ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రాణించిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో 8 పరుగులే చేసిన రోహిత్.. రెండో వన్డేలో 73 రన్స్, మూడో వన్డేలో 121 పరుగులు చేశాడు. చివరి వన్డేలో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్’ అందుకున్నాడు. సిరీస్‌లో హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా సొంతం చేసుకున్నాడు. వన్డే సిరీస్ ముగియడంతో హిట్‌మ్యాన్ ఆసీస్ వీడి భారత్ చేరుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించడంపై తాజాగా రోహిత్ స్పందించాడు.
Also Read: Daily Horoscope: మంగళవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగంలో జాక్‌పాట్ పక్కా!
తాను సన్నద్ధమైన విధానమే ఆస్ట్రేలియా సిరీస్‌లో విజయవంతమవడానికి కారణం అని రోహిత్ శర్మ చెప్పాడు. ‘నేను క్రికెట్ ఆడడం మొదలెట్టాక మొదటిసారి ఇన్ని రోజులు విశ్రాంతి దొరికింది. ఓ సిరీస్ ముందు 4-5 నెలల విరామం దొరకలేదు. ఈ విరామాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నా. ప్రణాళిక ప్రకారం పనులు చేయాలనుకున్నా. ఇది బాగా వర్కౌట్ అయింది. ఆస్ట్రేలియా సిరీస్‌లో విజయవంతం కావడానికి కారణం సన్నద్ధతే. మిగిలిన కెరీర్‌లో ఏం చేయాలో నాకు అర్థమైంది. ఈ విరామంలో నాకు నేను ఎంతో సమయాన్ని వెచ్చించుకున్నా. ఓ ఆటగాడికి ఇది ఎంతో ముఖ్యం. ప్రొఫెషనల్‌గా కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చేయాల్సింది చాలా ఉంటుంది. నాకు దొరికిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నా. ఇక ముందు కూడా ఇలానే కొనసాగుతా’ అని రోహిత్ చెప్పాడు.
