NTV Telugu Site icon

Rohit Sharma: ఆ సమయంలో నా మైండ్ బ్లాంక్ అయింది: రోహిత్‌ శర్మ

Rohit Sharma Press Conference

Rohit Sharma Press Conference

Rohit Sharma on T20 World Cup 2024 Final Match: బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత్.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్‌లో ఓ దశలో భారత్ పూర్తిగా వెనకపడిపోయింది. 15 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా గెలుపు సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులు. చేతిలో 6 వికెట్లున్న దక్షిణాఫ్రికా ఓటమి పాలవుతుందని ఎవరూ అనుకోలేదు. భారత అభిమానులే కాదు.. ఆటగాళ్లు కూడా మ్యాచ్‌ మీద ఆశలను దాదాపుగా వదిలేశారు. కానీ చివరి 5 ఓవర్లలో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో టీమిండియా అనూహ్య విజయం సాధించింది.

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌ విజయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యూహాలదీ కీలక పాత్ర. చివరి ఓవర్లలో బౌలర్లను అద్భుతంగా ఉపదయోగించుకున్నాడు. ఫీల్డింగ్ సెటప్ కూడా బాగా చేశాడు. ఫైనల్‌ విజయంపై రోహిత్ మరోసారి స్పందించాడు. తాజాగా డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హిట్‌మ్యాన్.. 15వ ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్‌ చెలరేగిపోవడంతో ఏం చేయాలో అర్ధం కాలేదని తెలిపాడు. ఆ సమయంలో తన మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిందని వెల్లడించాడు. ఎక్కువ దూరం ఆలోచించకుండా.. పరిస్థితులకు తగ్గట్లు స్పందించడంపై దృష్టి పెట్టానని చెప్పాడు.

Also Read: Filmfare Awards 2024: నానికి డబుల్ ధమాకా.. తెలుగు నామినేషన్స్‌ లిస్ట్ ఇదే!

‘హెన్రిచ్ క్లాసెన్‌ ఊచకోత తర్వాత నా మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయింది. అయితే ఆ సమయంలో ఎక్కువ దూరం ఆలోచించలేదు. పరిస్థితులకు తగ్గట్లు స్పందించడంపై దృష్టి పెట్టా. అప్పుడు ప్రశాంతంగా ఉండి ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నించడం ముఖ్యం. దక్షిణాఫ్రికా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సినపుడు మేం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాం. కానీ చివరి 5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన తీరు మేమెంత ప్రశాంతంగా ఉన్నామనడానికి నిదర్శనం. మేము మా ఆటపై దృష్టి పెట్టాము. అప్పుడు వేరే దేని గురించి పెద్దగా ఆలోచించలేదు. మేము అస్సలు భయపడలేదు’ అని హిట్‌మ్యాన్ తెలిపాడు.