Rohit Sharma: ఆ సమయంలో నా మైండ్ బ్లాంక్ అయింది: రోహిత్ శర్మ
- 30 బంతుల్లో 30 పరుగులు
- ఆశలు వదిలేసుకున్న ఫాన్స్
- ఏం చేయాలో అర్ధం కాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma on T20 World Cup 2024 Final Match: బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత్.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్‌లో ఓ దశలో భారత్ పూర్తిగా వెనకపడిపోయింది. 15 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా గెలుపు సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులు. చేతిలో 6 వికెట్లున్న దక్షిణాఫ్రికా ఓటమి పాలవుతుందని ఎవరూ అనుకోలేదు. భారత అభిమానులే కాదు.. ఆటగాళ్లు కూడా మ్యాచ్ మీద ఆశలను దాదాపుగా వదిలేశారు. కానీ చివరి 5 ఓవర్లలో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో టీమిండియా అనూహ్య విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలదీ కీలక పాత్ర. చివరి ఓవర్లలో బౌలర్లను అద్భుతంగా ఉపదయోగించుకున్నాడు. ఫీల్డింగ్ సెటప్ కూడా బాగా చేశాడు. ఫైనల్ విజయంపై రోహిత్ మరోసారి స్పందించాడు. తాజాగా డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హిట్‌మ్యాన్.. 15వ ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్ చెలరేగిపోవడంతో ఏం చేయాలో అర్ధం కాలేదని తెలిపాడు. ఆ సమయంలో తన మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిందని వెల్లడించాడు. ఎక్కువ దూరం ఆలోచించకుండా.. పరిస్థితులకు తగ్గట్లు స్పందించడంపై దృష్టి పెట్టానని చెప్పాడు.
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
Also Read: Filmfare Awards 2024: నానికి డబుల్ ధమాకా.. తెలుగు నామినేషన్స్ లిస్ట్ ఇదే!
‘హెన్రిచ్ క్లాసెన్ ఊచకోత తర్వాత నా మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయింది. అయితే ఆ సమయంలో ఎక్కువ దూరం ఆలోచించలేదు. పరిస్థితులకు తగ్గట్లు స్పందించడంపై దృష్టి పెట్టా. అప్పుడు ప్రశాంతంగా ఉండి ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నించడం ముఖ్యం. దక్షిణాఫ్రికా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సినపుడు మేం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాం. కానీ చివరి 5 ఓవర్లు బౌలింగ్ చేసిన తీరు మేమెంత ప్రశాంతంగా ఉన్నామనడానికి నిదర్శనం. మేము మా ఆటపై దృష్టి పెట్టాము. అప్పుడు వేరే దేని గురించి పెద్దగా ఆలోచించలేదు. మేము అస్సలు భయపడలేదు’ అని హిట్‌మ్యాన్ తెలిపాడు.
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!