NTV Telugu Site icon

Rohit Sharma: అందరి తండ్రుల మాదిరిగానే రోహిత్!

Rohit Sharma Practice

Rohit Sharma Practice

ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత జట్టు ఇప్పటికే కంగారో గడ్డకు చేరుకుంది. టీమిండియా ప్లేయర్స్ సాధన కూడా మొదలెట్టేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. రోహిత్ సతీమణి రితిక రెండో కాన్పు నేపథ్యంలో భారత్‌లోనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రోహిత్ ఆసీస్‌ వెళ్లేదెప్పుడో ఇప్పటికీ క్లారిటీ లేదు. అయినా కూడా హిట్‌మ్యాన్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను ఆపలేదు. రోహిత్ ముంబైలో బ్యాటింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ప్రయాణంకు సంబంధించి ఇప్పటివరకు ఏ సమాచారం లేదు. వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అందరు తండ్రుల మాదిరిగానే.. హిట్‌మ్యాన్ చేస్తున్నాడు. భార్య, కుటుంబంతో కలిసి ఉన్నాడు. కుటుంబంతో ఉన్నానని టెస్టు సిరీస్‌ కోసం ప్రాక్టీస్ చేయడంలో ఏ నిర్లక్ష్యం చూపించడం లేదు. సమయం దొరికినప్పుడల్లా ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు’ అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ప్రాక్టీస్ పోటోలను రోహిత్ పీఆర్‌ టీమ్‌ పోస్ట్ చేయగా.. తొలి టెస్టుకు అందుబాటులో ఉండేందుకే హిట్‌మ్యాన్‌ ప్రయత్నిస్తున్నాడని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.

Also Read: 5 Star Rating Cars: మహీంద్రా మూడు వాహనాలకు 5 స్టార్‌ రేటింగ్‌.. అవేంటో తెలుసా?

నవంబర్ 22న పెర్త్‌ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఒకవేళ రోహిత్ శర్మ పెర్త్‌ టెస్టుకు అందుబాటులో లేకుంటే.. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరిస్తాడు. ఈవిషయంపై ఇప్పటికే హెడ్ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పష్టత ఇచ్చాడు. హిట్‌మ్యాన్‌ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌తో కలిసి అభిమన్యు ఈశ్వరన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కేఎల్‌ రాహుల్‌ కూడా ఓపెనింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి ఎవరు ఆడతారో.