Rohit Sharma: ‘ముంబైకి రాజా’ ఏంటి ఆ చిలిపి పనులు.. ప్లేయింగ్ XIలో ఉంటాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి వార్తల్లో నిలిచాడు. నేడు (గురువారం) వాంఖెడే స్టేడియంలో జరిగే ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్‌కు ముందు ఆయన ఆడుతాడో లేదో అన్న అనుమానాలు నెలకొన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే నిన్న (బుధవారం) మాత్రం ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ పాల్గొన్నాడు. అంతేకాదు రోహిత్ అక్కడ చేసిన ఫన్నీ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
గత ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ హ్యామ్ స్ట్రింగ్ సమస్యతో మైదానం వీడిన విషయం తెలిసిందే. దీంతో అతను పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది సందేహంగా మారింది. మంగళవారం ప్రాక్టీస్‌కు కూడా హాజరుకాకపోవడంతో గాయం తీవ్రతపై చర్చలు మరింత పెరిగాయి.
అయితే బుధవారం రోహిత్ శర్మ మళ్లీ ప్రాక్టీస్‌లో కనిపించడం అభిమానులకు కొంత ఊరటనిచ్చింది. వాంఖెడే స్టేడియంలో వార్మప్ డ్రిల్స్ చేస్తూ, నెట్ ప్రాక్టీస్‌లో బ్యాటింగ్ కూడా చేశాడు. దీంతో మ్యాచ్‌కు ఆడే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు కనిపించాయి. ప్రాక్టీస్ సమయంలో చేసిన ఫిట్‌నెస్ డ్రిల్ లో భాగంగా కాళ్లను పైకి లేపుతూ ముందుకు కదులుతూ ఉండగా, రోహిత్ ఒక్కసారిగా ఫన్నీగా డాన్స్ చేయడం వీడియోలో కనిపించింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను అభిమానులు.. హమ్మయ్య మా రోహిత్ బాగుండడమే కాదు, స్టెప్స్ బలే చేశారు అంటూ తెగ చర్చ జరుగుతుంది.
అయితే ఈ వీడియోలో రోహిత్ తొడ భాగంలో బ్యాండేజ్ కనిపించడం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. గాయం పూర్తిగా తగ్గలేదనే సంకేతాలు కనిపించడంతో, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో అతని పాల్గొనడం పై సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి.
While we were tense yesterday, Rohit Sharma was out there enjoying the fitness drill 😭🔥 pic.twitter.com/Cgsaswqiro
— Rohan💫 (@rohann__45) April 16, 2026
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!